Share News

King Kobra Video:15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టుకుందంటే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 09:23 PM

కింగ్ కోబ్రాను మహిళా అధికారి సునాయాసంగా బంధించారు. అది కూడా కేవలం 6 నిమిషాల్లోనే పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

King Kobra Video:15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టుకుందంటే..
Forest Officer Roshini

పాము కనిపిస్తే చాలు.. భయంతో వెనక్కి తిరిగి చూడకుండ పరుగులు తీస్తాం. అది ఏ పామైనా సరే. పాములంటే మనుషుల్లో అంత భయం నిండిపోయింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కనిపిస్తే.. పైప్రాణాలు పైనే పోతాయి. కానీ, ఓ మహిళా అధికారిణి ఏ మాత్రం భయపడకుండా.. ఆ కింగ్ కోబ్రాను పట్టుకుంది. అది కూడా జస్ట్ 6 నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను బంధించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


కేరళ రాష్ట్రం తిరువనంతపురం పెప్పరలోని ఓ కాలువలో కింగ్ కోబ్రాను స్థానికులు గుర్తించారు. అనంతరం వారు ఈ విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనంతరం చాకచక్యంగా ఆ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దాదాపు 15 అడుగులు పొడవున్న ఆ కింగ్ కోబ్రాను కేవలం ఓ కర్ర సాయంతో పట్టుకుని సంచిలో బంధించారు.


అయితే ఈ వ్యవహారాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక రోషిణి ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. అయితే రోషణి ఈ తరహాలో దాదాపు 500కి పైగా పాములను పట్టుకున్నట్లు అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 10:00 PM