Share News

YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వ్లాగ్.. ఇది అస్సలు ఊహించలేదు..

ABN , Publish Date - May 19 , 2025 | 07:46 PM

YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్. 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెల్ విత్ పేరుతో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది.

YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వ్లాగ్.. ఇది అస్సలు ఊహించలేదు..
YouTuber Jyoti Malhotra

పాకిస్తాన్ కోసం గూఢాచారిగా మారిందన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది. దేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలు పాకిస్తాన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెల్ విత్ పేరుతో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది.


యూట్యూబ్‌లో 3 లక్షలకుపైగా మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పహల్గామ్ దాడికి కొన్ని నెలల ముందు ఆమె పాకిస్తాన్ వెళ్లింది. కటాస్ రాజ్ గుడిలో వీడియోలు చేసింది. కటాస్ రాజ్ గుడిలో పక్కపక్కనే శివాలయం, ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి. జ్యోతి ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లినపుడు.. ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆంజనేయస్వామి గర్భగుడిలో ఓ వ్యక్తి తెలుగులో దేవుడి పాట పాడుతూ ఉన్నాడు. అది కూడా ప్రఖ్యాత ఘంటసాల గారి పాట పాడుతూ ఉన్నాడు.


స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన అద్భుత చిత్రం భూకైలాష్‌లోని ‘రాముని అవతారం.. రవికుల సోముని అవతారం’ పాట పాడుతూ ఉన్నాడు. అతడు పాడుతుంటే ఓ నిమిషం పాటు జ్యోతి చప్పుడు చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లో ఘంటసాల పాట వినిపించటంపై తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి

Mumbai Shocker: ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు.. మరీ నీచంగా..

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్

Updated Date - May 19 , 2025 | 08:38 PM