Share News

JCB Nagini dance: వావ్.. సూపర్ ట్యాలెంట్.. జేసీబీలతో నాగినీ డ్యాన్స్ ఎలా వేయించారో చూడండి..

ABN , Publish Date - Dec 01 , 2025 | 07:37 PM

వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా జేసీబీలు నాగినీ డ్యాన్స్ వేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

JCB Nagini dance: వావ్.. సూపర్ ట్యాలెంట్.. జేసీబీలతో నాగినీ డ్యాన్స్ ఎలా వేయించారో చూడండి..
JCB Nagini dance viral

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా జేసీబీలు నాగినీ డ్యాన్స్ వేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (JCB viral video).


desiindianarchitect అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నిర్మాణ ప్రదేశంలో వరుసగా జేసీబీలు పార్క్ చేసి ఉన్నాయి. ఆ జేసీబీల చేత డ్రైవర్లు నాగినీ డ్యాన్స్ చేయించారు. ఓ వ్యక్తి మధ్యలో కూర్చుని వేణువు వాయిస్తుండగా చుట్టూ ఉన్న జేసీబీలు అద్భుతంగా డ్యాన్స్ వేశాయి. సంగీతానికి అనుగుణంగా డ్రైవర్లు జేసీబీ ట్రంక్‌లను కదిలించారు. ఆ జేసీబీ డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తాయి (Nagini dance clip).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (trending JCB video). ఆ వీడియోను లక్షల మంది వీక్షించారు. 8,700 మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఆ జేసీబీల టైమింగ్స్ అద్భుతం అని ఒకరు కామెంట్ చేశారు. జేసీబీల నాగినీ డ్యాన్స్ సహజంగా కనిపిస్తోందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పాపం.. మృగరాజు.. అడవి గేదెపై దాడి చేస్తే ఏం జరిగిందో చూడండి..


మీ దృష్టి షార్ప్ అయితే.. ఈ ఫొటోలో తోడేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 01 , 2025 | 07:37 PM