Share News

JCB dal stirring video: వార్నీ.. జేసీబీని ఇలా కూడా వాడతారా.. పప్పును ఇలా కలిపితే ఎవరైనా తింటారా..

ABN , Publish Date - Sep 21 , 2025 | 03:57 PM

వేలాది మందికి వంటలు చేసే సమయంలో పరిశుభ్రత పాటించరనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. అంత భారీగా వంట చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

JCB dal stirring video: వార్నీ.. జేసీబీని ఇలా కూడా వాడతారా.. పప్పును ఇలా కలిపితే ఎవరైనా తింటారా..
Viral cooking hack

వేలాది మందికి వంటలు చేసే సమయంలో పరిశుభ్రత పాటించరనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. అంత భారీగా వంట చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే పప్పును కలిపేందుకు ఆ వీడియోలో ఓ జేసీబీని ఉపయోగించడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. అలా వంట చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు (viral cooking hack).


mr_neeraj_8457 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (viral desi food hacks). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అక్కడ ఓ జాతర లేదా ధార్మిక కార్యక్రమం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వేలాది మంది ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసేందుకు భారీగా సరుకులు కూడా ఉన్నాయి. ఆరుబయట ఓ భారీ కుండలో పప్పు తయారు చేశారు. ఆ పప్పును కలిపేందుకు ఓ జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఆ పప్పును కలుపుతోంది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (JCB in kitchen).


ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు (dal stirring with JCB). 'అక్కడ వంట చేస్తున్నారా? నిర్మాణ పనులు జరుగుతున్నాయా?' అని ఒకరు ప్రశ్నించారు. 'ఇంత పెద్ద ఎత్తున పప్పును తయారు చేయడానికి ఈ పద్ధతి సులభం కావచ్చు, కానీ పరిశుభ్రత గురించి ఆందోళన చెందడం సమంజసమే' అని మరొకరు కామెంట్ చేశారు. ఈ యంత్రాన్ని ముందుగానే శుభ్రపరిచి ఉంటారని మరికొందరు సమాధానాలు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. నీ తెలివికి సలాం తల్లీ.. వంట వీడియోను ఎలా షూట్ చేస్తోందో చూడండి..

మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2025 | 03:57 PM