నడక... జపాన్ స్టయిల్లో...
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:42 AM
వ్యాయామాల్లోనే కాదు... మార్నింగ్‌వాక్‌లో కూడా రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఉదయం పూట నడక చాలా మంచిదనే విషయం తెలిసిందే. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ రోజూ పార్కుల్లో, కాలనీల్లో, చెరువు గట్టుపై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని చూస్తూనే ఉంటాం.

వ్యాయామాల్లోనే కాదు... మార్నింగ్‌వాక్‌లో కూడా రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఉదయం పూట నడక చాలా మంచిదనే విషయం తెలిసిందే.
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ రోజూ పార్కుల్లో, కాలనీల్లో, చెరువు గట్టుపై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని చూస్తూనే ఉంటాం. అయితే ఎన్ని అడుగులు నడవాలి? ఎలా నడవాలి? అనే విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. సహజంగానే పొదుపు, ఆరోగ్యం విషయంలో జపాన్ తత్వాలు, సిద్ధాంతాలకు పెద్దపీట వేస్తుంటారు. అలా వారి నుంచి మొదలైన మరో సరికొత్త నడక ట్రెండ్ ‘జపనీస్ వాకింగ్’. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ జీవన విధాన నడకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ విశేషాలే ఇవి...
ప్రతీరోజూ పదివేల అడుగులు... ఇదొక సాంప్రదాయ నడక పద్ధతి. అంటే రోజూ 10 వేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి మేలు అని ఆరోగ్య నిపుణులు చెబుతారు. రోజూ శారీరక శ్రమకు ఇదొక సులువైన బెంచ్‌మార్క్‌గా రూపకల్పన చేశారు. చాలామంది ఫిట్‌నెస్ ట్రాకర్స్, స్మార్ట్‌ఫోన్ సాయంతో 10 వేల అడుగులు లెక్కిస్తుంటారు.
ఆరోగ్యకరమైన జీవన విధానానికి నడక అనేది (ఏ పద్ధతి అయినా సరే) ఒక దివ్యౌషధం. అది శరీరాన్నే కాకుండా, మనసును కూడా ఫిట్‌గా ఉంచుతుంది. వయసు, జెండర్‌తో సంబంధం లేదు. పలు ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క ఉత్తమ మార్గం నడకనే అంటు న్నారు గురువులు, ఆరోగ్య నిపుణులు.
పది వేల అడుగుల కన్నా ‘ఐడబ్ల్యూటీ’ విధానంలో నడక చక్కని ఫలితాలను ఇస్తుందని హార్వర్డ్ డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల రక్తప్రసరణ సరిగా జరుగుతుందని, గుండెపోటు రిస్క్ తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
‘టెన్ థౌజండ్ స్టెప్స్’కు ప్రత్యమ్నాయంగా ‘జపనీస్ వాకింగ్’ ప్రాచుర్యంలోకి వస్తోంది. దీనినే ‘ఇంటర్వెల్ వాకింగ్ టెక్నిక్’ (ఐడబ్ల్యూటీ) అని కూడా అంటారు. ఇది 30 నిమిషాల రిలాక్స్డ్ నడక విధానం. ఇందులో భాగంగా 3 నిమిషాలు నెమ్మదిగా, 3 నిమిషాలు వేగంగా నడవాల్సి ఉంటుంది. అలా 30 నిమిషాల పాటు నడవాలి. నడక ప్రారంభించే ముందు ఐదు నిమిషాలు వార్మప్ తప్పనిసరి.
కాసేపు వేగంగా నడిచి, కాసేపు నెమ్మదిగా, రిలాక్స్డ్‌గా నడవడం వల్ల శ్వాస ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలకు ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. రక్తప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది.
2022 యు.కె. పరిశోధన కూడా ‘టెన్ థౌజండ్ స్టెప్స్’ (9,800 అసలు లెక్క) వల్ల డిమెన్షియా నుంచి కాపాడుతుందని చెబుతారు. అయితే ఈ అడుగుల లెక్క అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా బిజీగా ఉండేవారికి, కీళ్లనొప్పులు ఉన్నవారికి ఈ నడక పద్ధతి కష్టతరంగా మారుతుంది.
జపనీయులు ఆఫీసుకు వెళ్తున్నా, షాపింగ్‌కు వెళ్తున్నా ఈ టెక్నిక్‌నే ఎక్కువగా వాడతారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కాసేపు గమనిస్తే ఇది స్పష్టమవుతుంది.
ఉదయంఈ తరహా నడక తర్వాత తీసుకునే అల్పాహారం కూడా సమతుల్యంగా ఉండాల్సిందే. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఆరోగ్యంగా ఉంచడమేగాక, ఫిట్‌నెస్‌కు ఊతం ఇస్తుంది.