Italys PM Meloni: పీఎం మెలోనికి ఏమైంది.. ఏంటా ప్రవర్తన..
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:18 PM
Giorgia Meloni NATO: మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన మెలోనిని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ వింతగా ప్రవర్తించారు. కళ్లు పెద్దవి చేస్తూ.. కోపంగా చూస్తున్నట్లు చాలా వింతగా ప్రవర్తించారు.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని గురించి భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా భారతీయులకు బాగా చేరువయ్యారు. ఆమెకు సంబంధించిన వీడియో తరచుగా వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా, ఆమె నాటో సమిట్ 2025లో పాల్గొన్నారు. నెదర్లాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ లీడర్స్ అందరూ భౌగోళిక రాజకీయ సమస్యలపై చర్చించారు. ఈ సమిట్‌లో ప్రధాని మెలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వింతగా ప్రవర్తించారు.
మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన మెలోనిని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ వింతగా ప్రవర్తించారు. కళ్లు పెద్దవి చేస్తూ.. కోపంగా చూస్తున్నట్లు చాలా వింతగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి ఏమైంది’..‘ఆమె చాలా భయంకరంగా కనిపిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నువ్వసలు మనిషివేనా.. మూగ జీవిపై అంత దారుణమా..
బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..