Share News

International Space Station: అంతరిక్షంలో ఇదో అద్భుతం..

ABN , Publish Date - Jul 06 , 2025 | 10:34 AM

మన భూగోళానికి సరిగ్గా నాలుగువందల కి.మీ.పైన ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఈ మధ్య భారత వైమానిక దళ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంషు శుక్లా కూడా అక్కడికి వెళ్లాడు.

International Space Station: అంతరిక్షంలో ఇదో అద్భుతం..
International Space Station

మన భూగోళానికి సరిగ్గా నాలుగువందల కి.మీ.పైన ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఈ మధ్య భారత వైమానిక దళ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంషు శుక్లా కూడా అక్కడికి వెళ్లాడు. ఇలా అనేకమంది వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

1. అంతరిక్షంలో మనిషి తయారు చేసిన అతి పెద్ద నిర్మాణం ఏదైనా ఉందంటే అది ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌’ (ఐఎస్‌ఎస్‌).

2. ఇదెంత పెద్దదంటే ఒక ఫుట్‌బాల్‌ మైదానమంత విశాలమైనది. దీని పొడవు 356 అడుగులు.

3. ఆవాసం.. 13,696 క్యూబిక్‌ అడుగులు.. అంటే.. సుమారు ఆరు పడగ్గదుల వైశాల్యమన్నమాట!.

4. ఐఎస్‌ఎస్‌ను ఒకేసారి నిర్మించలేదు. చిన్నచిన్న భాగాలను అమర్చుతూ .. జతకలుపుతూ వెళ్లారు వ్యోమగాములు.


book6.3.jpg

5. అంతరిక్షంలోని ఐఎస్‌ఎస్‌ భూమికి ఎంతో దూరంలో లేదు. కేవలం 400 కి.మీ.లోనే ఉంది.

6. దీని వేగం ఊహాతీతం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతుంటుంది.

7. వ్యోమగాములు రోజుకు 16 సూర్యోదయాలు, మరో 16 సూర్యాస్తమయాలు చూస్తారిక్కడ.

8. సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రయోగశాలగా పనిచేస్తుంది. భూమిపైన సాధ్యం కాని ప్రయోగాలు చేస్తారిక్కడ.

9. వివిధ రంగాలకు చెందిన మూడువేల రకాల పరిశోధనలు ఐఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్నారు వ్యోమగాములు.

10. ఆస్ట్రోనాట్స్‌ తరచూ స్పేస్‌వాక్‌ చేస్తూ తమ అనుభవాలను రికార్డు చేస్తారు. మార్పులు గమనిస్తుంటారు.


book6.2.jpg

11. ఐఎస్‌ఎస్‌లో 2000 ఏడాది నుంచి మనిషి ఉనికి ఉంది. ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 240 కి పైగా వ్యోమగాములు అక్కడికి వెళ్లొచ్చారు.

12. ఇందులో 84 కిలోవాల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సౌరశక్తి యూనిట్‌ ఉంది.

13. నిద్రపోవడానికి ఆరు స్లీపింగ్‌ క్వార్టర్లు, రెండు బెడ్‌రూమ్‌లు, ఒక జిమ్‌ ఉందిక్కడ.

14. ఒక అంచనా ప్రకారం ఐఎస్‌ఎస్‌ ఏర్పాటుకు అయిన వ్యయం.. సుమారు 150 బిలియన్‌ డాలర్లు.

15. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో రెండు మరుగుదొడ్లు ఉన్నాయి. వ్యోమగాములు విసర్జించిన మూత్రాన్ని తిరిగి తాగునీళ్ల్లుగా మార్చే వడబోత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.


16. ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాముల దగ్గర ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి భూమిపైనున్న మిత్రులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ అయ్యేందుకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కూడా ఉంది.

17. అంతరిక్షంలో తేలుతున్నప్పటికీ... దీని బరువు 460 టన్నులు.

18. స్పేస్‌ స్టేషన్‌లోని వ్యోమగాములు జుట్టును కత్తిరించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి!. వాక్యూమ్‌కు అనుసంధానించిన క్లిప్పర్స్‌ను జుట్టుకు బిగించుకుని హెయిర్‌కట్‌ చేసుకుంటారు.

19. వ్యోమగాములు అంతరిక్షంలో కాస్త పొడవు పెరుగుతారు.

20. ప్రెజరైజ్‌ చేసిన బోయింగ్‌ 747 విమానమంత పెద్ద గది అక్కడుంది.

Updated Date - Jul 06 , 2025 | 11:36 AM