Share News

Indian jugaad: ఇతడి తెలివికి దండం పెట్టాల్సిందే.. సాక్స్‌లను ఎలా మార్చేశాడో చూడండి..

ABN , Publish Date - Nov 06 , 2025 | 08:08 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Indian jugaad: ఇతడి తెలివికి దండం పెట్టాల్సిందే.. సాక్స్‌లను ఎలా మార్చేశాడో చూడండి..
genius jugaad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (creative hack).


mememood_31 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కాళ్లకు వేసుకునే సాక్స్‌లను సగానికి కట్ చేశాడు. ఆ తర్వాత సాక్స్‌కు కొద్దిగా పైన చిన్న కోత పెట్టాడు. అలా రెండు సాక్స్‌లను ఒకే తరహాలో కట్ చేశాడు. అతను ఏమి చేస్తున్నాడో ఆ సమయంలో అర్థం కాలేదు. మరుక్షణంలో పూర్తి విషయం బోధపడింది. ఆ సాక్స్‌లను అతడు చేతులకు తొడుక్కునే గ్లౌజ్‌ల్లా మార్చేశాడు. ఆ రెండు సాక్స్‌లను గ్లౌజ్‌ల్లా మార్చేసుకుని చేతులకు తొడుక్కున్నాడు (desi talent).


ఈ సూపర్ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (unbelievable innovation). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. 30 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. దీనిని టెక్నాలజీ అంటారని ఒకరు కామెంట్ చేశారు. సూపర్ ఐడియా అని చాలా మంది మెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

అడవి గేదెపై సింహం దాడి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మీది డేగ చూపు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న స్పైడర్‌ను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 06 , 2025 | 08:08 PM