Gold Purity: ఇంట్లోనే బంగారం ప్యూరిటీని చెక్ చేసుకోండిలా
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:04 PM
Gold Purity: బంగారం కొనాలనుకున్నప్పుడు పుత్తడి స్వచ్ఛతను తెలుసుకోవడం ముఖ్యం. మీరు కొనే బంగారం నిజమైనదా కాదా తెలుసుకోవాలి.. లేకపోతే మోసం పోవడం ఖాయం.
బంగారం అంటే ఇష్టపడిని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా మహిళలకు బంగారం మీద మక్కువ ఎక్కవే. కానీ ఇప్పుడు బంగారం ధరలు మాత్రం కొండెక్కి కూర్చుకున్నాయి. బంగారం కొనాలంటేనే అమ్మో అనేలా చేస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశానంటుతున్నప్పటికీ కొందరు మాత్రం పుత్తడి మీద ఇష్టంతో బంగారాన్ని కొంటూనే ఉంటారు. అయితే బంగారం కొనేటప్పుడు దాన్ని స్వచ్ఛతను తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు మీరు కొంటున్న బంగారం నిజమైనదా లేక నకిలీదా అని తెలుసుకోవడం ముఖ్యం. బంగారం స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బంగారం కొనాలనుకున్నా లేదా వివిధ కారణాల వల్ల తాకట్టు పెట్టాలనుకున్నా కూడా దాన్ని స్వచ్ఛతను పరీక్షించాల్సి ఉంటుంది. లేదంటూ మోసపోయే ప్రమాదమూ ఉంది. లక్షలు విలువ చేసే బంగారం నిజమైనదో కాదో తెలుసుకోవడం ప్రధానం. బ్యాంకుల్లో లేదా నగదు కంపెనీల్లో వివిధ రకాలుగా బంగారాన్ని పరీక్షించి అది నిజమైనదో కాదో చూస్తుంటారు. అయితే మనం ఇంట్లో కూడా బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో లేదా శాతాల్లో కొలుస్తారు. 24 క్యారెట్ల (100శాతం ప్యూరిటీ) బంగారం స్వచ్ఛమైన బంగారం అని అర్ధం. అలాగే మార్కెట్లో 22 క్యారెట్లు (91.67శాతం స్వచ్ఛత), 18 క్యారెట్ల (75శాతం స్వచ్చత) బంగారం కూడా ఉంటాయి. అయితే బంగారంతో నగదు తయారు చేసే ముందు వెండి లేదా రాగి కలిపి బరువైన రూపాన్ని ఇస్తారు.

History Of OK: ‘ఓకే’.. అసలు చరిత్ర ఇదే
ఇంట్లో బంగారం ప్యూరిటీ చెక్ చేయాలంటే ముందుగా బంగారంపై బీఐఎస్ హల్‌మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్స్ స్టాండర్డ్స్ ఇచ్చే సర్టిఫెకెట్స్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటే నిజమైన బంగారం అని అర్ధం. అలాగే హాల్‌మార్క్‌లో ఐదు రాకాలు ఉంటాయి. బీఐఎస్ లోగో, స్వచ్ఛత (క్యారెట్లు లేదా శాతం), హాల్ మార్కింగ్ సంవత్సరం, అప్రైసర్ మార్క్, ఆభరణాల వ్యాపారి గుర్తు ఉంటాయి. మీరు కొన్న బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఉందో లేదో భూతద్ధంలో పరిశీలించాలి.
సిరామిక్ ప్లేట్‌పై కూడా మీ బంగారం స్వచ్ఛమైనదా కాదా నిర్ధారించుకోవచ్చు. మీ వద్ద ఉన్న బంగారాన్ని సిరామిక్ ప్లేట్‌పై రుద్దండి. మీ బంగారం స్వచ్చమైనది అయితే సిరామిక్ ప్లేట్‌పై బంగారం గీత కనిపిస్తుంది. అదే నకిలీది అయితే మాత్రం నలుపు, బూడిద రంగులో ప్లేట్‌పై గీత కనిపిస్తుంది. అయితే సిరామిక్ ప్లేట్‌పై పరీక్ష చేసేటప్పుడు బంగారంపై కూడా గీతలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కొనుగోలు చేసిన బంగారం స్వచ్చమైనదా లేక నకిలీదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యంగా మీ బంగారం స్వచ్ఛతను పరీక్షచేయండిక.
ఇవి కూడా చదవండి
Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest Pratyekam News And Telugu News