Viral Video: వామ్మో.. వీళ్లు కలిసి కాపురం చేస్తారా? ఈ వధూవరులు పెళ్లి వేదిక మీద ఏం చేశారో చూడండి..
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:27 PM
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో మధురమైన ఘట్టం. కలకాలం భార్యాభర్తలుగా కలిసి ఉండేందుకు బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా చేసుకునే ముఖ్యమైన కార్యక్రమం. అలాంటి వేదికపైనే గొడవలు పడి అందరికీ ఆశ్చర్యం కలిగించింది తాజాగా ఓ జంట.
వివాహం (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో మధురమైన ఘట్టం. కలకాలం భార్యాభర్తలుగా కలిసి ఉండేందుకు బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా చేసుకునే ముఖ్యమైన కార్యక్రమం. అలాంటి వేదికపైనే గొడవలు పడి అందరికీ ఆశ్చర్యం కలిగించింది తాజాగా ఓ జంట. వివాహ వేదికపై వధూవరుల (Bride and Groom) మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంట గురించి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. ఇద్దరూ కలిసి వెడ్డింగ్ కేక్ కట్ చేశారు. ముందుగా వధువు కేక్ ముక్కను వరుడికి తినిపించింది. అనంతరం వరుడు ఆ కేక్‌ను వధువుకు పెట్టగా ఆమె తినడానికి నిరాకరించింది. దీంతో వరుడికి కోపం వచ్చింది. ఆ కేక్ ముక్కను కింద పడేసి, కాలితో టేబుల్ మీద ఉన్న కేక్‌ను తన్నేశాడు. ఆ తర్వాత కిందకు దిగిపోయాడు. దీంతో అక్కడున్న అందరూ షాకయ్యారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. 2.8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ వరుడికి ఆ పెళ్లి కంటే తన ఆత్మగౌరవమే ముఖ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఇంతకీ ఆ పెళ్లి జరిగిందా అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో టీ కెటిల్‌ను ఎలా కడుగుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..
షాకింగ్.. 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రష్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..