Share News

Funny Viral Video: అక్కా.. ల్యాప్‌టాప్‌ను ఇలా కూడా వాడొచ్చా.. ఈమె తెలివితేటలు చూస్తే..

ABN , Publish Date - Jul 14 , 2025 | 09:42 AM

ప్రస్తుతం నెట్టింట ఓ ఫన్నీ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ తన బ్రెయిన్‌ను అమోఘంగా ఉపయోగిస్తోంది. పూరీలను చేయడానికి ఆమె ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిన విధానం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

Funny Viral Video: అక్కా.. ల్యాప్‌టాప్‌ను ఇలా కూడా వాడొచ్చా.. ఈమె తెలివితేటలు చూస్తే..
Funny Viral Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో (Funny Video) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ తన బ్రెయిన్‌ను అమోఘంగా ఉపయోగిస్తోంది. పూరీ (Puri)లను చేయడానికి ఆమె ల్యాప్‌టాప్‌ (Laptop)ను ఉపయోగించిన విధానం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.


@PalsSkit అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ వంట గదిలో పూరీలను తయారు చేస్తోంది. అందుకు ఆమె ల్యాప్‌టాప్‌ను ఉపయోగించింది. ముందుగా ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసి కీబోర్డ్‌పై ఓ కవర్ పెట్టింది. ఆ కవర్ మీద నాలుగు గోధుమ పిండి ముద్దలను ఉంచింది. వాటిపై మరో కవర్‌ను పెట్టింది. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ను మూసేసి గట్టిగా వొత్తింది. దీంతో ఆ పిండి ముద్దలు పూరీలుగా మారిపోయాయి. పూరీలను కష్టపడి వొత్తాల్సిన అవసరం లేకుండా ఆమె ఇలా ప్లాన్ చేసిందన్న మాట.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈమె తన బ్రెయిన్‌ను 200 శాతం వినియోగించిందని ఒకరు కామెంట్ చేశారు. ల్యాప్‌టాప్ సృష్టికర్తలు ఈ వీడియో చూస్తే మూర్ఛపోతారని మరొకరు పేర్కొన్నారు. ఈమె ఐక్యూ ఐన్‌స్టీన్ ఐక్యూకు సమానమని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 998ల మధ్య 993 ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 14 , 2025 | 11:02 AM