Share News

Viral News: తండ్రి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డబ్బుల వర్షం..

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:36 PM

కుమారులు తండ్రి చివరి కోరికను నెరవేర్చారు. అంత్యక్రియల్లో భాగంగా హెలికాప్టర్ నుండి లక్షల్లో డబ్బుల వర్షం కురిపించారు. అయితే..

 Viral News: తండ్రి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డబ్బుల వర్షం..
Helicopter Money

Viral News: అమెరికాలోని డెట్రాయిట్‌లో నివసించే డారెల్ థామస్ అనే వ్యక్తి జూన్ 15న మరణించాడు. ఆయన మరణించిన దాదాపు 12 రోజుల తర్వాత జూన్ 27న ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఆయన కుమారులు డారెల్ జూనియర్, జోంటే.. తండ్రికి వినూత్నంగా నివాళులర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

58 ఏళ్ల డారెల్ థామస్ మానవత్వం కలిగిన వ్యక్తి. అలాగే సంపన్నుడు కూడా. పేద ప్రజలకు నిత్యం సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే, పలు కారణాల వల్ల అతడు జూన్ 15న మృతి చెందాడు. అయితే, జూన్ 27న అంత్యక్రియల సందర్భంగా థామస్ కుమారులు తమ తండ్రి చివరి కోరికను తీర్చడానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. దాని నుండి గులాబీ రేకులను కురిపించడమే కాకుండా, దాదాపు $5,000 (రూ. 4,27,700) నగదు వర్షం కురిపించారు. ఆకాశం నుండి కరెన్సీ నోట్లు కింద పడుతుండటంతో అక్కడ ఉన్న వారు వాటిని పట్టుకోవడానికి ఎగబడ్డారు. దీంతో దాదాపు గంట మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.


సమాచారం ప్రకారం, డారెల్ కుమారులు డబ్బుల వర్షం కురిపించడంతో ట్రాఫిక్ సమస్య కలిగిందన్న సంగతి పోలీసులకు తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డెట్రాయిట్ పోలీసులు తమ స్థాయిలో ఎటువంటి దర్యాప్తు జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంపై ఇప్పుడు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. ఎందుకంటే, తండ్రి చివరి కోరిక తీర్చడం తప్పు కాదు.. కానీ, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగేలా వ్యవహారించడం తప్పేనని స్పష్టం చేసింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పేద ప్రజలకు చనిపోయినా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాడు.. గ్రేట్.. అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం తండ్రి చివరి కోరిక అంటూ హెలికాప్టర్ నుండి లక్షల్లో డబ్బులు కురిపించే బదులు పేద వారి దగ్గరికి వెళ్లి డబ్బు పంపిణి చేసి ఉంటే సరిపోతుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Also Read:

ఆఫీస్‌లో లంచ్‌కు రావాలంటూ పిలుపు.. అక్కడికెళ్లాక ఎన్నారై మహిళకు షాక్

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్‌కు సీరియస్.. వెంటిలేటర్‌పై చికిత్స

For More Viral News

Updated Date - Jul 02 , 2025 | 04:04 PM