Share News

SI Drunk Lying: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ఎస్‌ఐ.. ఏకంగా సీనియర్లపై..

ABN , Publish Date - Jul 23 , 2025 | 08:28 PM

SI Drunk Lying: గ్రామస్తులు అతడు పని చేసే పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చారు. అతడ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతడు మాత్రం పొదల్లో దొర్లుతూ అక్కడే పడుకున్నాడు తప్ప పక్కకు వెళ్లలేదు.

SI Drunk Lying: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ఎస్‌ఐ.. ఏకంగా సీనియర్లపై..
SI Drunk Lying

తప్పతాగిన ఓ ఎస్‌ఐ రెచ్చిపోయాడు. రోడ్డుపక్క పొదల్లో దొర్లుతూ రచ్చరచ్చ చేశాడు. సీనియర్ ఆఫీసర్లను సైతం బూతులు తిట్టాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రఘునాథ్ సింగ్ రాజావత్ ఖాఖ్‌రేరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రఘునాథ్ మద్యానికి బానిస అయ్యాడు. యూనిఫామ్‌లో ఉన్నపుడు కూడా ఫుల్లుగా మందు తాగుతున్నాడు.


కొద్దిరోజుల క్రితం రఘునాథ్ ఫుల్‌గా మందు తాగి రోడ్డు పక్క పడిపోయాడు. రోడ్డున పోయే వాళ్లను ఇబ్బంది పెట్టసాగాడు. తిట్టసాగాడు. దీంతో గ్రామస్తులు అతడు పని చేసే పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చారు. అతడ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతడు మాత్రం పొదల్లో దొర్లుతూ అక్కడే పడుకున్నాడు తప్ప పక్కకు వెళ్లలేదు. అంతటితో ఆగకుండా సీనియర్ అధికారులపై కూడా బూతులతో రెచ్చిపోయాడు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియో ఎస్పీ దృష్టికి కూడా వెళ్లింది. రఘునాథ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈ సంఘటనపై డీఎస్సీ బ్రిజ్‌మోహన్ రాయ్ మాట్లాడుతూ... ‘రఘునాథ్‌ను వెంటనే విధులనుంచి తొలగించాము. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతూ ఉంది. ఫ్యాక్ట్ చెక్ తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

బస్టాండ్‌లో డిటొనేటర్లు, జిలెటిన్ స్టిక్‌లు.. సెక్యూరిటీ అలర్ట్

రూ.250ల ఈ ఫుడ్ అంటే అంబానీ ఫ్యామిలీకి చాలా ఇష్టం..

Updated Date - Jul 23 , 2025 | 09:08 PM