Viral Video: విమానం ఎక్కుతూ ట్రంప్ తడబాటు.. కొంచెం ఉంటే..
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:23 PM
US President Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఆదివారం న్యూజెర్సీలోని మారీస్ టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతూ ఉన్నారు. మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళుతూ ఉన్నారు. కుడి చేత్తో రేయిలింగ్ పట్టుకుని నడుస్తూ ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు కాలం నడుస్తోంది. మిత్రుడు ఎలన్ మస్క్ కాస్తా శత్రువైపోయాడు. ప్రతీ విషయంలో ట్రంప్‌కు అడ్డుగా నిలుస్తున్నాడు. మస్క్ కారణంగా ట్రంప్ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మస్క్ తలపోట్లు .. మరో వైపు పని ఒత్తిడితో అల్లాడుతున్న ఆయన తాజాగా, విమానం మెట్లపై కాలు జారారు. కొంచెం ఉంటే మెట్ల మీద నుంచి కిందపడిపోయేవారు.
అదృష్టం బాగుండి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. డొనాల్డ్ ట్రంప్ ఆదివారం న్యూజెర్సీలోని మారీస్ టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతూ ఉన్నారు. మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళుతూ ఉన్నారు. కుడి చేత్తో రేయిలింగ్ పట్టుకుని నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ మెట్టు మీద కాలు పెట్టారు.
మెట్టు చివరన కాలు పెట్టడంతో .. కాలు జారింది. వెంటనే నిలదొక్కుకున్నాడు. కుడి చెయ్యి రేయిలింగ్‌ను పట్టుకుని ఉండటంతో మోకాళ్లపై కింద పడకుండా ఆగాడు. ఆ వెంటనే పైకి లేచి, టకటకా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను బాగా గమనిస్తే.. తడబడ్డానికి ముందు ట్రంప్ ముఖంలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంతో నిరాసక్తంగా ఆయన మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తడబడ్డారు.