Share News

Bull red color: ఎరుపు రంగు చూస్తే ఎద్దుకు కోపం వస్తుందా.. అసలు నిజమేంటి..

ABN , Publish Date - Dec 25 , 2025 | 06:17 PM

మనందరం చిన్న వయసు నుంచి కొన్ని విషయాలను బలంగా నమ్ముతుంటాం. వాటిల్లో ఒకటి ఎద్దు ఎరుపు రంగు చూస్తే ఆగ్రహానికి గురవుతుందనుకోవడం. ఎరుపు రంగు చూస్తే ఎద్దు దాడికి దిగుతుందని మనందరం నమ్ముతాం. అది నిజమేనా.

Bull red color: ఎరుపు రంగు చూస్తే ఎద్దుకు కోపం వస్తుందా.. అసలు నిజమేంటి..
bull red color myth

మనందరం చిన్న వయసు నుంచి కొన్ని విషయాలను బలంగా నమ్ముతుంటాం. వాటిల్లో ఒకటి ఎద్దు ఎరుపు రంగు చూస్తే ఆగ్రహానికి గురవుతుందనుకోవడం. ఎరుపు రంగు చూస్తే ఎద్దు దాడికి దిగుతుందని మనందరం నమ్ముతాం. అది నిజమేనా. కాదు.. ఎరుపు రంగు చూస్తే ఎద్దుకు కోపం వస్తుందనేది అపోహ మాత్రమే. అందులో నిజం లేదు. మరి అసలు నిజమేంటి..? (does red make a bull angry).


నిజానికి ఎద్దులు ఎరుపు రంగును గుర్తించలేవు. అవి ఎక్కువగా బూడిద, నలుపు రంగులనే గుర్తించగలవు. ఎరుపు రంగు కూడా వాటికి డార్క్ గ్రేలా కనిపిస్తుంది. మరి, మనం తరచుగా చూసే బుల్ ఫైట్‌లలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఎందుకు ఊపుతారు. ఆ వస్త్రాన్ని చూసి ఎద్దులు ఎందుకు రెచ్చిపోతాయి? నిజానికి ఎద్దులు ఎరుపు రంగు వల్ల కాదు.. వేగంగా ఊపే వస్త్రం కదలిక వల్ల ఉద్రేకానికి గురవుతాయి. ఆ వస్త్రాన్ని అలా కదిలించడం వల్ల ఎద్దులోని దాడి లేదా ఆత్మరక్షణ స్వభావం మేల్కొంటుంది. తనను రెచ్చగొడుతున్నట్టు ఆ ఎద్దు భావించి ముందుకు ఉరుకుతుంది (bull red color myth).


మరి, బుల్ ఫైట్లలో ఎరుపు రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారు (bull behavior facts). ఆ ఎరుపు రంగు వస్త్రం ఉపయోగించేది ఎద్దుల కోసం కాదు.. మనుషుల కోసం. ఆ ఎరుపు రంగు వస్త్రంపై రక్తపు మరకలు పడినా అవి కనిపించవు. అలాగే ప్రేక్షకులకు ఆ రంగు చాలా డామినేటింగ్‌గా, డ్రమటిక్‌గా కనిపిస్తుంది. అందుకే ఎరుపు రంగు వస్త్రాన్ని కదిలిస్తారు. ఎద్దు ముందు ఎరుపు, తెలుపు, నీలం.. ఇలా ఏ రంగు వస్త్రాన్ని కదిలించినా అది అలాగే ప్రతిస్పందిస్తుంది.


ఇవి కూడా చదవండి..

కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2025 | 06:17 PM