Share News

Viral Video: కూతుర్ని దారుణంగా కొట్టిన డాక్టర్

ABN , Publish Date - Jun 22 , 2025 | 07:45 PM

Viral Video: పాప ఏం తప్పు చేసిందో తెలీదు కానీ, ఆ డాక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. కర్రతో పాపను చావగొట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. మానవత్వం మరిచిపోయి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు.

Viral Video: కూతుర్ని దారుణంగా కొట్టిన డాక్టర్
Viral Video

హిమాచల్ ప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ పెంపుడు కూతురితో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. పదేళ్ల పాపను కర్రతో దారుణంగా చితక్కొట్టాడు. కొట్టొద్దని పాప ఎంత ప్రాథేయపడినా వినలేదు. భార్య ముందే పాపను హింసించాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఛండీఘర్, సెక్టార్ 15కు చెందిన ఓ డాక్టర్, అతడి భార్య 7 ఏడేళ్ల క్రితం ఓ పాపను దత్తత తీసుకున్నారు. పాప వయసు ప్రస్తుతం పది సంవత్సరాలు. డాక్టర్ కుటుంబం కొద్దిరోజుల క్రితం షిమ్లాలోని బంధువుల ఇంటికి వచ్చింది.


పాప ఏం తప్పు చేసిందో తెలీదు కానీ, ఆ డాక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. కర్రతో పాపను చావగొట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. మానవత్వం మరిచిపోయి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డాక్టర్ భార్య అక్కడికి వచ్చింది. అతడ్ని ఆపే ప్రయత్నం చేసింది. అయినా అతడు ఆగలేదు. ఇంట్లో పరిగెత్తించి మరీ బాలికను కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. డాక్టర్‌ను ఆపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Jun 22 , 2025 | 07:53 PM