Camel ride gone wrong: ఒంటె మీద సవారీ మామూలు విషయం కాదు.. ఓ జంట పరిస్థితి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:02 PM
ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. చాలా ప్రశాంతంగా కనిపించే ఒంటెలు పెద్ద పెద్ద బరువులను మోసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఒంటెలు ఎక్కువగా కనబడుతుంటాయి.
ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. చాలా ప్రశాంతంగా కనిపించే ఒంటెలు పెద్ద పెద్ద బరువులను మోసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఒంటెలు ఎక్కువగా కనబడుతుంటాయి. అక్కడికి వెళ్లే పర్యాటకులు ఒంటెల మీద కూర్చుని సవారీ చేస్తుంటారు. సాధారణంగా ఒంటెలు ఎలాంటి ఇబ్బందీ కలిగించవు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒంటె మీద కూర్చున్న ఓ జంటకు చుక్కలు కనిపించాయి (couple camel ride).
@JaikyYadav16 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో పుష్కర్ మేళా జరుగుతోంది. ఈ ఉత్సవం చూడడానికి చాలా మంది పర్యాటకులు అక్కడకు వెళ్తున్నారు. అలా వెళ్లిన ఒక జంట ఒంటె పైకి ఎక్కి కూర్చుంది. ఆ ఒంటె పైకి లేచినపుడు బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో అంత ఎత్తైన ఒంటె పై నుంచి ఆ జంట కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళ వెన్నెముకకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆమె చాలా సేపు అక్కడి నుంచి లేవలేకపోయింది (shocking camel incident).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు (funny travel moments). వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఒంటెపై నుంచి పడిపోవడం ఒక అంతస్థు భవనం పైకప్పు నుంచి పడిపోవడం లాంటిదని ఒకరు కామెంట్ చేశారు. ఒంటెల స్వారీ విలాసం కాదని ఒకరు పేర్కొన్నారు. ఒంటెల సవారీకి వెళ్లేవారు కూడా హెల్మెట్లు ధరించాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అడవి గేదెపై సింహం దాడి.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న స్పైడర్‌ను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..