Share News

వి‘చిత్ర’ వధువు

ABN , Publish Date - Mar 16 , 2025 | 07:10 AM

కర్ణాటకకు చెందిన ఈ ప్రముఖ బాడీ బిల్డర్‌... కండలు తిరిగిన తన దేహదారుఢ్యాన్ని పెళ్లికూతురు గెటప్‌లో ప్రదర్శించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 వి‘చిత్ర’ వధువు

పెళ్లికూతురంటే... సుకుమారంగా, అందంగా ముస్తాబై మంటపానికి వస్తుంది. కానీ చిత్రా పురుషోత్తం ఇందుకు పూర్తి భిన్నం. కర్ణాటకకు చెందిన ఈ ప్రముఖ బాడీ బిల్డర్‌... కండలు తిరిగిన తన దేహదారుఢ్యాన్ని పెళ్లికూతురు గెటప్‌లో ప్రదర్శించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తన ప్రియసఖుడు కిరణ్‌రాజ్‌తో ఇటీవల చిత్ర నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆపై జరిగిన ప్రీవెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో ఈ కండలరాణి... నీలం, బంగారు వర్ణాలు కలగలిసిన కాంజీవరం పట్టుచీర, స్ట్రాప్‌లెస్‌ జాకెట్‌, మెడ నిండా బంగారు నగలు, వడ్డాణం, పాపిడ బిళ్ల, జుంకాలు, గాజులు, మాంగ్‌ టిక్కా ధరించి... తలనిండా మల్లెపూలను అందంగా సింగారించుకొని... తన కండల్ని ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. అటు సంప్రదాయాన్ని, ఇటు తన శక్తిని మేళవించి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ, ‘మైండ్‌సెట్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’ అనే క్యాప్షన్‌ జోడించింది. వెరైటీగా ఉన్న ఆ ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి.


book1.jpg

బాడీబిల్డర్‌గా చిత్ర అనేక పోటీల్లో పాల్గొని... ఎన్నో టైటిల్స్‌ సొంతం చేసుకుంది. ‘మిస్‌ ఇండియా ఫిట్‌నెస్‌ అండ్‌ వెల్‌నెస్‌’, ‘మిస్‌ సౌత్‌ ఇండియా’, ‘మిస్‌ కర్నాటక’ వంటి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఔత్సాహికులకు ఫిట్‌నెస్‌ మెలకువలూ నేర్పుతోంది.

Updated Date - Mar 16 , 2025 | 08:22 AM