Viral: పెట్రోల్ పంపులో ఊహించని సంఘటన.. బైకులో పెట్రోల్ నింపుతుండగా..
ABN , Publish Date - May 12 , 2025 | 01:34 PM
Bike Catches Fire: మొదట బైకు పెట్రోల్ ట్యాంకు దగ్గర మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పెట్రోల్ కొట్టే పైపుకు కూడా మంటలు చుట్టుకున్నాయి. బైకు ఓనర్ భయంతో బైకును కిందపడేసి.. అక్కడినుంచి దూరంగా పరుగులు తీశాడు.

జీవితం చాలా చిన్నది.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరమూ ఊహించలేము. చావు మనల్ని ఏ వైపునుంచైనా.. ఏ విధంగానైనా చేరవచ్చు. భూమ్మీద మనకు ఇంకా నూకలు మిగిలి ఉంటే.. చావు అంచుల వరకు వెళ్లినా.. ప్రాణాలతో బయటపడవచ్చు. అదృష్టం బాగుండి చావు అంచుల వరకు వెళ్లి వెనక్కు వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనను కూడా చెప్పుకోవచ్చు. తాజాగా, ఓ పెట్రోల్ పంపులో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్ పట్టే పైపుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇంత జరిగినా అదృష్టం కొద్దీ అక్కడున్న వాళ్లు క్షేమంగా బయటపడ్డారు.
ఇంతకీ సంగతేంటంటే.. మహారాష్ట్ర, బుల్దానా జిల్లా, షెగాన్‌కు చెందిన ఓ వ్యక్తి బైకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి పల్దివాల్ పెట్రోల్ పంపుకు వెళ్లాడు. పెట్రోల్ కొట్టే చోటుకు వచ్చి పెట్రోల్ పట్టించుకుంటూ ఉన్నాడు. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఉన్నట్టుండి పెట్రోల్ ట్యాంకు దగ్గర మంట మొదలయింది. ఆ వెంటనే పెట్రోల్ కొట్టే పైపుకు కూడా మంటలు చుట్టుకున్నాయి. బైకు ఓనర్ భయంతో బైకును కిందపడేసి.. అక్కడినుంచి దూరంగా పరుగులు తీశాడు.
బైకు మంటల్లో కాలిపోతూ ఉంది. పెట్రోల్ కొట్టే వ్యక్తి మంటలు ఆర్పే సాధనాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో మంటల్ని ఆర్పేశాడు. అదృష్టం బాగుండి అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెట్రోల్ కొట్టే పైపుకు అంటుకున్న మంటలు.. పైపు ద్వారా లోపలికి వెళ్లి ఉంటే భారీ పేలుడు సంభవించి ఉండేది. పెట్రోల్ కొట్టే వ్యక్తి సరైన సమయంలో స్పందించటం వల్ల పెను ప్రమాదం తప్పింది. అయితే, మొబైల్ ఫోన్ రింగ్ అవ్వటం వల్లే మంటలు మొదలయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
King Cobra: కోడె నాగును ఇంత ముద్దుగా ఎప్పుడూ చూసుండరు..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..