Share News

Basmati Rice Sack: బాస్మతి రైస్ ప్యాకెట్‌తో జాకెట్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - May 28 , 2025 | 03:17 PM

Basmati Rice Sack Jacket: కొద్దిరోజుల క్రితం అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ యువతి సచి రాజ్‌గురూ ఓ బొటిక్‌కు వెళ్లింది. అది చాలా కాస్ట్‌లీ బొటిక్. అందులో డ్రెస్సులు చూస్తూ ఉండగా.. ఆమెకు వింతైన జాకెట్ కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయింది.

Basmati Rice Sack: బాస్మతి రైస్ ప్యాకెట్‌తో జాకెట్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Basmati Rice Sack Jacket

రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో బట్టల మిల్లు సీన్లు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటుకుల చిట్టిబాబు( రాజేంద్ర ప్రసాద్) అమ్ముడు పోకుండా మూలన పడిన బట్టల్ని ఇష్టం వచ్చినట్లు చేసి.. లేటెస్ట్ ప్యాషన్ అని చెప్పి మార్కెట్లోకి వదులుతుంటాడు. గాలి బొక్కల చొక్కా, తుపుక్ తుపుక్ చొక్కాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. నైంటీస్ కిడ్స్ ఆ సీన్లు చూసి నోరెళ్ల బెట్టారు. ఇలాంటి పిచ్చి, పిచ్చి బట్టలు కూడా వస్తాయా... అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అలాంటి బట్టలే ట్రెండ్ అయిపోయాయి.


కాదేదీ ప్యాషన్‌కు అనర్హం అన్నట్లు.. గోనె సంచులు కూడా చొక్కాలుగా మారిపోతున్నాయి. అలాగని వాటి ధర తక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. అమెరికాకు చెందిన ఓ బొటిక్ బాస్మతి రైస్ బ్యాగుతో తయారు చేసిన జాకెట్ ధర తెలిస్తే మతి పోతుంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ యువతి సచి రాజ్‌గురూ ఓ బొటిక్‌కు వెళ్లింది. అది చాలా కాస్ట్‌లీ బొటిక్. అందులో డ్రెస్సులు చూస్తూ ఉండగా.. ఆమెకు వింతైన జాకెట్ కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయింది.


అది బాస్మతి రైస్ బ్యాగ్‌తో తయారు చేసిన జాకెట్. ఇండియానుంచి రాయల్ బాస్మతి రైస్ అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఆ బొటిక్ వాళ్లు ఆ రైస్ బ్యాగులతో జాకెట్లు కుట్టారు. వాటిని అమ్మకానికి పెట్టారు. ధర ఎంతంటే.. అక్షరాల 2 వేల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో అయితే లక్షా 62 వేల రూపాయలు. వాటి ధర చూసి సుచి షాక్ అయింది. ఓ జాకెట్ తీసి వేసుకుంది. ఆ జాకెట్ బానే ఉంది. బాస్మతి రైస్ బ్యాగ్ జాకెట్‌కు సంబంధించిన వీడియోను ఆమె తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఇంటి మెట్ల కింద ఈ ఒక్క వస్తువు ఉంటే చాలు.. బీరువా సంపదతో నిండిపోతుంది..

Updated Date - May 28 , 2025 | 03:59 PM