Share News

కూరగాయలతో ఆర్కెస్ట్రా..

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:27 AM

క్లాసిక్‌, రాక్‌, పంక్‌... ఇలా వివిధ సంగీత నేపథ్యాల నుంచి వచ్చిన 11 మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పడి... 1998లో ‘వెజిటబుల్‌ ఆర్కెస్ట్రా’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ను ప్రారంభించారు. గత 27 ఏళ్లుగా అనేక దేశాల్లో సుమారు 344 కాన్సర్ట్‌లు నిర్వహించారు.

కూరగాయలతో ఆర్కెస్ట్రా..

కూరగాయల్ని వండుతాం... కానీ ఆస్ట్రియాకు చెందిన ఓ బ్యాండ్‌ మాత్రం వాటితో సంగీతం సృష్టిస్తూ అబ్బురపరుస్తోంది. ఉల్లిపాయలు, క్యారెట్‌, గుమ్మడికాయ, కీరదోస, క్యాబేజీ, క్యాప్సికమ్‌ వంటి కూరగాయలే వారి మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌. వాటితో కచేరీలు చేస్తూ ‘గిన్నిస్‌ బుక్‌’ లో కూడా స్థానం సంపాదించారు.

క్లాసిక్‌, రాక్‌, పంక్‌... ఇలా వివిధ సంగీత నేపథ్యాల నుంచి వచ్చిన 11 మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పడి... 1998లో ‘వెజిటబుల్‌ ఆర్కెస్ట్రా’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ను ప్రారంభించారు. గత 27 ఏళ్లుగా అనేక దేశాల్లో సుమారు 344 కాన్సర్ట్‌లు నిర్వహించారు. ‘ఏ వస్తువు నుంచైనా సంగీతాన్ని సృష్టించొచ్చ’ని చెప్పడమే వీరి ముఖ్య ఉద్దేశం. అయితే వీరంతా ఒకసారి ఉపయోగించిన వాయిద్యాలను తిరిగి వాడరు.


ప్రతీ ప్రదర్శనకు ముందు తాజా కూరగాయలను కొని తెచ్చుకుని, వాటితోనే అప్పటికప్పుడు కొత్త వాయిద్యాలను సృష్టిస్తారు. ఇక ప్రదర్శన పూర్తయ్యాక ఆ కూర గాయలతో సూప్‌ తయారు చేయించి కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులకు అందించడం విశేషం. కొన్నిసార్లు వాటిని సేంద్రియ ఎరువుగా మారుస్తారు. అంతేకాదు... కూరగాయ తొక్కలను ఎండబెట్టి వాటితో కూడా కొత్త కొత్త శబ్దాలను సృష్టిస్తారు. ఏదేమైనా అందరిలా రెగ్యులర్‌ వాయిద్యాలతో కాకుండా, కూరగాయలతో వెరైటీ సంగీతం అనే వీళ్ల ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Updated Date - Aug 31 , 2025 | 11:27 AM