Share News

Aunty creative hack: వామ్మో.. ఇంతకు తెగిస్తారా? ఈ ఆంటీ చేతిలోని బ్యాగ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:25 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విభిన్నమైన వస్తువులు రూపొందించేవారి జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Aunty creative hack: వామ్మో.. ఇంతకు తెగిస్తారా? ఈ ఆంటీ చేతిలోని బ్యాగ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
aunty viral video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విభిన్నమైన వస్తువులు రూపొందించేవారి జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది (Jugaad gone wild).


pro_admin9 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Crazy viral jugaad) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ మార్కెట్‌లో కూరగాయలను కొనుగోలు చేస్తోంది. కూరగాయల వ్యాపారి కూరగాయలను తూకం వేసి వాటిని ఆమె తెచ్చుకున్న బ్యాగ్‌లో వేశాడు. అయితే ఆ బ్యాగ్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎందుకంటే ఆ బ్యాగ్‌ను అండర్‌వేర్‌తో రూపొందించారు. పాత అండర్‌‌వేర్‌ కింద కుట్టేసి దానిని సంచిలా మార్చేసింది. ఆ బ్యాగ్‌కు ఓ పట్టీని కూడా తగిలించింది. దీంతో అది హ్యాండ్‌బ్యాగ్‌లా మారిపోయింది.


అలాంటి సంచిని ఎవరైనా తీసుకెళ్లడం మీరు ఎప్పుడూ చూసి ఉండరు (Aunty viral video). దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. కేవలం వీడియో కోసమే ఇలాంటి బ్యాగ్‌ను రూపొందించారని ఒకరు కామెంట్ చేశారు. ఎంత పేదవారు అయినా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ వాడరని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బరువు తగ్గండి.. లక్షలు సంపాదించండి.. ఉద్యోగులకు ఓ కంపెనీ ఆఫర్..

మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులను 10 సెకెన్లలో కనిపెట్టండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2025 | 01:25 PM