Viral Video: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ.. ఇలాంటి శిక్ష వేస్తారనుకోలేదు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:38 AM
Viral Video: చేతులు, కాళ్లు నొప్పి తీయటం మొదలెట్టాయి. అయినా వాళ్లు వదల్లేదు. అతడితో రకరకాల సెట్లు చేయించారు. బరువు ఎత్తులేక అల్లాడిపోయాడు. విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా జిమ్ చేయించారు.
సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారు?.. మొదటగా దొంగ దొరకగానే జనం చావగొడతారు. తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. నూటికి 90 శాతం కేసుల్లో ఇలానే జరుగుతుంది. కానీ, ఓ దొంగకు మాత్రం వింత విచిత్రమైన అనుభవం ఎదురైంది. అతడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఇక, నా పని అయిపోయిందిరా.. చావగొడతారు అనుకున్నాడు. అయితే, దొంగను పట్టుకున్న వ్యక్తులు అతడ్ని కొట్టలేదు. తిట్టలేదు. ఓ వింతైన శిక్ష వేశారు. ఆ శిక్ష ఏంటి? తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం స్టోరీ తెలుసుకోవాల్సిందే..
సంఘటనకు సంబంధించిన వివరాలు.. బంగ్లాదేశ్, కాక్స్ రోడ్‌లో ఓ దొంగ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ‘ఇక నా పని అయిపోయింది రా’ అనుకున్నాడు దొంగ. అయితే, దొంగను పట్టుకున్నవాళ్లు అతడ్ని ఏమీ చేయలేదు. నేరుగా జిమ్‌కు తీసుకెళ్లారు. జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేయమన్నారు. దొంగ తనలో తాను నవ్వుకున్నాడు. హుషారుగా వాళ్లు చెప్పింది చేయటం మొదలెట్టాడు. రెండు, మూడు సెట్లు చేయగానే అతడికి చుక్కలు కనిపించాయి.
చేతులు, కాళ్లు నొప్పి తీయటం మొదలెట్టాయి. అయినా వాళ్లు వదల్లేదు. అతడితో రకరకాల సెట్లు చేయించారు. బరువు ఎత్తులేక అల్లాడిపోయాడు. విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా జిమ్ చేయించారు. అతడు బరువులు ఎత్తలేక నేలపై కూలబడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘భవిష్యత్తులో గొప్ప దొంగ అవ్వాలని ట్రైనింగ్ ఇస్తున్నారు’..‘పాపం కష్టపడి జిమ్ చేశాడు. స్నానం చేయించి.. సెంట్ కొట్టి పంపించండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తీసుకోవాలో తెలుసా?
బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..