Share News

True Love: ఇతని ప్రేమ ఎంత మధురం.. ఆమె కుక్కపిల్ల అనుమతి సైతం పొంది..పరవశించిపోయాడు

ABN , Publish Date - Aug 06 , 2025 | 07:29 PM

తన భాగస్వామికి లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత, ఆ వ్యక్తి ఆమె కుక్కపిల్లకి కూడా ప్రపోజ్ చేస్తాడు. పప్పీ ఓకే చెప్పాక అతనిలో కలిగిన అనుభూతికి మొత్తం ఇంటర్నెట్ కదిలింది!. సదరు వీడియో వైరల్ అవ్వడమే కాదు,

True Love: ఇతని ప్రేమ ఎంత మధురం.. ఆమె కుక్కపిల్ల అనుమతి సైతం పొంది..పరవశించిపోయాడు
True Love

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమలు, పెళ్లిళ్లు ఈ రోజుల్లో చాలా కామన్. ప్రేమలైతే, ఇక చెప్పనే అక్కర్లేదు. అయితే, ఇతని ప్రేమ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ఒక వ్యక్తి తన ప్రియురాలితో తన ప్రేమను ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. అయితే, ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆమె పప్పీ(కుక్కపిల్ల)కి సైతం తన లవ్ ప్రపోజ్ చేసి కుక్కపిల్ల చేత కూడా ఓకే అనిపించుకున్న సందర్భాన్ని చాటే వీడియో సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఈ వీడియో ఇప్పుడు ప్రేమకే కొత్తనిర్వచనం చెప్పినట్టు వైరల్ అవుతోంది. తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు బాక్స్ లోంచి గోల్డ్ రింగ్ తీసి ఆమె చేతి వేలికి తొడిగినట్టే, బాక్స్ లో నుంచి ఒక బొమ్మ తీసి పప్పీకి ప్రపోజ్ చేశాడా వ్యక్తి. ఈ వీడియో చూసి అతనికి నెటిజన్లు 'గ్రీనెస్ట్ ఫ్లాగ్'అనే బిరుదును కూడా ప్రదానం చేశారంటే ఆలోచించండి. ఇందులో ఎంత మధురమైన, గాఢమైన ప్రేమ దాగుందో.. పప్పీ తన ప్రేమకు ఓకే చెప్పిందన్న సంతోషం అతనిలో అణువణువునా కనిపించడం నెటిజన్ల హృదయాలను మరీ గట్టిగా తాకింది. ఆ వీడియో చూసి మీరేమనుకుంటున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 07:34 PM