Share News

Viral Jugaad Video: వామ్మో.. ఈమెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ఈ ఐడియా ఎలా వచ్చిందో..

ABN , Publish Date - Jul 19 , 2025 | 09:40 AM

వెరైటీ పనులు చేసే వ్యక్తులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ప్రింటర్‌తో రోటీలు చేస్తున్నట్టు క్రియేటివ్‌గా రూపొందించిన వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఆ ఫన్నీ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Viral Jugaad Video: వామ్మో.. ఈమెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ఈ ఐడియా ఎలా వచ్చిందో..
Funny Viral Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్న ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వెరైటీ పనులు చేసే వ్యక్తులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు (Funny Videos) నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ప్రింటర్‌ (Printer)తో రోటీలు (Rotis) చేస్తున్నట్టు క్రియేటివ్‌గా రూపొందించిన వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఆ ఫన్నీ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.


@PalsSkit అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి తన బ్రెయిన్‌ను అద్భుతంగా ఉపయోగించి ప్రింటర్ సహాయంతో రోటీలను చేసేసింది. ముందుగా చపాతీ పిండిని ప్రింటర్‌పై పెట్టింది. ప్రింటర్ ఓపెన్ చేసి కాల్చిన రోటీని పెట్టి స్విచ్ ఆన్ చేసింది. దీంతో ఆ చపాతీ పిండి ప్రింటర్ లోపలికి వెళ్లి పూర్తిగా కాలిన చపాతీల్లా బయటకు వచ్చాయి. అంటే ఒక రోటీ నుంచి జెరాక్స్‌లు వచ్చాయన్న మాట. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈమె ఐన్‌స్టీన్ కంటే తెలివైనదని ఒకరు కామెంట్ చేశారు. నిజంగా ప్రింటర్‌లో నుంచి రోటీలు అలా బయటకు వచ్చేస్తే ఎంత బాగుంటుందో అని ఒకరు పేర్కొన్నారు. ఈ టెక్నిక్ ఇప్పుడు ప్రతి వంటగదిలోకి రావాలని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

మీ చూపు షార్ప్ అయితే.. ఈ అడవిలో కప్ కేక్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2025 | 10:07 AM