Jugaad Video: ఇతడి తెలివి ఇంజినీర్లకు కూడా ఉండదేమో.. మినీ జేసీబీని ఎలా తయారు చేశాడో చూడండి..
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:14 PM
తక్కువ వనరులతో సామాన్య వ్యక్తులు తయారు చేసే కొన్ని పరికరాలకు సంబంధించిన జుగాడ్ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తయారు చేసిన మినీ జేసీబీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తక్కువ వనరులతో సామాన్య వ్యక్తులు తయారు చేసే కొన్ని పరికరాలకు సంబంధించిన జుగాడ్ వీడియోలు (Jugaad Videos) నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తయారు చేసిన మినీ జేసీబీ (Mini JCB) చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి జనరేటర్, చిన్న చక్రాలు, ఇతర స్క్రాప్ వస్తువులను ఉపయోగించి మినీ జేసీబీని తయారు చేశాడు. దాని సహాయంతో చక్కగా మట్టిని తవ్వుతూ కాలువ ఏర్పాటు చేస్తున్నాడు. అది పూర్తిగా జేసీబీలాగానే పని చేస్తోంది. అటూ ఇటూ తిరుగుతూ మట్టిని తవ్వుతోంది. తవ్విన మట్టిని పక్కకు విసిరేస్తోంది. ఓ వ్యక్తి ఆ మినీ జేసీబీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 21 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి తెలివితేటలు నిజమైన ఇంజినీర్లకు కూడా ఉండవేమో అని ఒకరు కామెంట్ చేశారు. జేసీబీ తయారీదారులు ఇతడి కోసం వెతుకుతున్నారని మరొకరు పేర్కొన్నారు. అతడు ఏ ఐఐటీలో చదువుకున్నాడు అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
వీడు నావాడు.. పెళ్లి వేదికపై వరుడిని కౌగిలించుకున్న బుర్కా మహిళ.. వధువు రియాక్షన్ చూస్తే..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో గుర్రం ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..