Love Proposal: పాపం.. గర్ల్‌ఫ్రెండ్‌కు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:41 AM
ప్రత్యేకమైన పద్ధతిలో లవ్ ప్రపోజ్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఎంతో సన్నద్ధమవుతారు. రిహార్సల్స్ కూడా వేసుకుని ప్రియురాలిని సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రేమించిన అమ్మాయికి (Girl Friend) చాలా వెరైటీగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ ప్రేమ (Love) గురించి చెప్పాలని చాలా మంది అనుకుంటారు. ప్రత్యేకమైన పద్ధతిలో లవ్ ప్రపోజ్ (Love Proposal) చేయాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో సన్నద్ధమవుతారు. రిహార్సల్స్ కూడా వేసుకుని ప్రియురాలిని సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవకతప్పదు.
@MarchUnofficial అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ప్రకృతి ఒడిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. ఆమెను ఓ జలపాతం మధ్యలో నిలబెట్టాడు. ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీశాడు. అయితే జలపాతం చాలా వేగంగా ప్రవహిస్తుండడంతో బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కిందకు జారుకుంటూ వెళ్లిపోయాడు. పాపం.. ఆ అమ్మాయి డానీ.. డానీ.. అని కేకలు వేసింది. అతడు అలా జారుకుంటూ వెళ్లి కింద నీటిలో పడిపోయాడు.
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు 16 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. అతడు బతికే ఉన్నాడా అని చాలా మంది కామెంట్లు చేశారు. ఆ యువకుడు బతికే ఉన్నాడని, స్వల్ప గాయాలపాలయ్యాడని చాలా మంది కామెంట్ల ద్వారా తెలియజేశారు. అలాంటి డేంజరస్ ప్రదేశాల్లో ప్రపోజ్ చేయకూడదని కొందరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా? ఈజిప్ట్‌లో బయటపడిన తిమింగళం భారీ అస్థిపంజరం..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..