Share News

Girl Funny Video: పాపం.. అమ్మాయిలకు హెల్ప్ చేద్దామని హీరోలా వచ్చాడు.. చివరకు ఏమయ్యాడంటే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:39 PM

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇద్దరమ్మాయిలకు హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్లాడు. అయితే అతడి సహాయం వల్ల ఆ ఇద్దరమ్మాయిలకు నష్టమే జరిగింది. అతడు కూడా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Girl Funny Video: పాపం.. అమ్మాయిలకు హెల్ప్ చేద్దామని హీరోలా వచ్చాడు.. చివరకు ఏమయ్యాడంటే..
Funny viral Video

రోడ్డు మీద ప్రయాణించేటపుడు ఏదైనా ప్రమాదం జరిగితే చుట్టూ ఉన్నవారు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. అమ్మాయిలకు ప్రమాదం జరిగితే మరింత మంది వారికి సహాయం చేసేందుకు వెళ్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అలాగే ఇద్దరమ్మాయిలకు హెల్ప్ (Help) చేయడానికి ముందుకు వెళ్లాడు. అయితే అతడి సహాయం వల్ల ఆ ఇద్దరమ్మాయిలకు నష్టమే జరిగింది. అతడు కూడా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది.


@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రోడ్డు పక్కన కారు నిలిపి ఉంది. స్కూటీ (Scooty) మీద ఇద్దరు అమ్మాయిలు అటువైపుగా వచ్చి కారు ముందు బ్రేక్ వేశారు. బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వేగంగా అక్కడకు పరిగెత్తుకు వచ్చాడు. కింద పడిపోయిన స్కూటీని పైకి లేపాడు. అయితే అతడు స్కూటీ హ్యాండిల్‌ను ఎక్స్‌లేటర్ ఉన్న వైపు పట్టుకున్నాడు. దీంతో స్కూటీ రైజ్ అయిపోయి ముందుకు వెళ్లిపోయింది. రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి ఆ స్కూటీ వెళ్లిపోయింది.


ఆ స్కూటీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి కూడా దానితో పాటే చెరువులోకి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయిలిద్దరూ షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. చాలా బాగా సహాయం చేశాడని ఒకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..


మీ కళ్లకు సవాల్.. ఈ గదిలో నల్ల పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2025 | 12:39 PM