Share News

Breaking News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ABN , First Publish Date - Oct 18 , 2025 | 09:48 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌
BC Bandh

Live News & Update

  • Oct 18, 2025 21:29 IST

    భారత్-పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం

    • రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు

    • కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో భూ ప్రకంపనలు

  • Oct 18, 2025 21:28 IST

    ఏపీ అభివృద్ధిలో ఉద్యోగులది కీలకపాత్ర: సీఎం చంద్రబాబు

    • ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి: సీఎం చంద్రబాబు

    • మొత్తం రూ.7 వేలకోట్ల వరకు డీఏలు బకాయి ఉన్నాయి: సీఎం చంద్రబాబు

    • డీఏలను గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది: చంద్రబాబు

    • సరెండర్‌ లీవ్స్‌కు రూ.730 కోట్ల బకాయిలు పెట్టారు: సీఎం చంద్రబాబు

    • ప్రజలు, ఉద్యోగుల పక్షాన మా ప్రభుత్వం ట్రస్టీగా పనిచేస్తోంది: చంద్రబాబు

    • కూటమి ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుంది: సీఎం చంద్రబాబు

    • గతంలో భవిష్యత్‌ ఆదాయాలు చూపించి భారీగా అప్పులు తెచ్చారు

    • ప్రభుత్వ ఆదాయంలో జీతాలకే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి: చంద్రబాబు

    • వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో ఏం జరుగుతోందో ప్రజలతో పాటు ఉద్యోగులకూ తెలియాలి

    • మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు

    • గతంలో ఆగిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించాం: చంద్రబాబు

    • గత వైసీపీ పాలనలో కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం వల్ల..

    • ఉద్యోగుల పైనా ఆ ప్రభావం పడింది: సీఎం చంద్రబాబు

    • ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం: చంద్రబాబు

    • దీపావళి ముంది విశాఖకు గూగుల్‌ సంస్థ రావడం శుభపరిణామం: చంద్రబాబు

  • Oct 18, 2025 21:27 IST

    ఏపీ అభివృద్ధిలో ఉద్యోగులది కీలకపాత్ర: సీఎం చంద్రబాబు

    • విశాఖకు గూగుల్‌ సంస్థ రావడం సంతోషకరం: సీఎం చంద్రబాబు

    • ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మా ప్రభుత్వ బాధ్యత

    • ఏపీ విభజన వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

  • Oct 18, 2025 21:25 IST

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

    • ఉద్యోగులకు తక్షణం ఒక డీఏ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

    • నవంబర్‌ 1న ఉద్యోగుల డీఏకు రూ.164 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు

    • పోలీస్‌ శాఖకు రూ.110 కోట్లు ఇవ్వాల్సి ఉంది: సీఎం చంద్రబాబు

    • 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ ఎప్పుడైనా వాడుకునే అవకాశం: చంద్రబాబు

    • ఎర్న్‌డ్‌ లీవ్స్‌ 50-50 కింద క్లియర్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు

    • RTC ఉద్యోగులకు ఒక ప్రమోషన్‌ క్లియర్‌ చేస్తాం: సీఎం చంద్రబాబు

    • కిందిస్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్స్‌ ఇస్తాం

    • పోలీసులకు రెండు ఇన్‌స్టాల్మెంట్స్‌లో సరెండర్‌ లీవ్స్‌ చెల్లిస్తాం: చంద్రబాబు

    • జనవరిలోపు రూ.105 కోట్లు చొప్పున రెండుసార్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు

    • గతంలో ఎక్సైజ్‌ శాఖలో భవిష్యత్‌ ఆదాయం పైనా అప్పు తెచ్చారు: చంద్రబాబు

    • గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.34 వేలకోట్లకు పైగా ఉన్నాయి

    • గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నాం: సీఎం చంద్రబాబు

  • Oct 18, 2025 20:42 IST

    తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్‌ దరఖాస్తులకు ముగిసిన దరఖాస్తు గడువు

    • తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో ముగిసిన గడువు.

    • చివరిరోజు భారీగా టెండర్లు దాఖలు.

    • ఈ రోజు ఒక్కరోజే 30వేలకు పైగా వచ్చిన దరఖాస్తులు.

    • మొత్తం 90వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా.

    • 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన ఓ మహిళ.

    • ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తు చేసిన మహిళా.

    • దరఖాస్తు చేసుకున్న యూపీ, కర్ణాటక, ఒడిశాకు చెందిన మహిళలు.

    • తెలంగాణలో 2,620 వైన్ షాపులకు గత నెల 27న విడుదలైన టెండర్ నోటిఫికేషన్.

    • ఈ రోజు సాయంత్రం 5గంటలతో ముగిసిన దరఖాస్తుల గడువు.

    • ఈనెల 23న మద్యం డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ లు ఇవ్వనున్న ప్రభుత్వం.

  • Oct 18, 2025 18:18 IST

    హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం.

    • ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

    • హాజరైన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు.

  • Oct 18, 2025 17:44 IST

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు శనివారం నాడు 31 మంది నామినేషన్లు..

    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇవాళ 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

    • బీఆర్ఎస్ నుంచి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు.

    • బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి తరఫున నామినేషన్ వేసిన దీపక్ రెడ్డి భార్య హరిత.

    • ఇప్పటి వరకు ఆరు రోజుల్లో మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

    • ఈనెల 21 తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ.

    • నామినేషన్ వేయడానికి మంగళవారం రోజు మాత్రమే ఛాన్స్.

    • రేపు ఆదివారం, ఎల్లుండి దీపావళి కావడంతో 21 మాత్రమే నామినేషన్ల దాఖలుకు చాన్స్ ఉంది.

  • Oct 18, 2025 15:38 IST

    బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: సీతక్క

    • 6 నెలలుగా బీసీ బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది

    • పెండింగ్‌లో పెట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు: మంత్రి సీతక్క

    • రిజర్వేషన్ల అంశంలో బీజేపీది 2 నాలుకల ధోరణి: సీతక్క

  • Oct 18, 2025 15:38 IST

    మరో పరువు హత్య

    • కొమురంభీం: దహెగాం మండలం గెర్రె గ్రామంలో పరువుహత్య

    • 8 నెలల గర్భిణి రాణిని గొడ్డలితో నరికి చంపిన మామ

    • కొడుకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడని తండ్రి ఘాతుకం

  • Oct 18, 2025 13:05 IST

    ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ తీరంలో బోటు ప్రమాదం

    • ముగ్గురు భారతీయులు మృతి, మరో ఐదుగురు గల్లంతు

    • ప్రమాద సమయంలో బోటులో 14 మంది భారతీయులు

  • Oct 18, 2025 13:05 IST

    బీసీ బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది: మహేష్‌గౌడ్

    • ఇదే చిత్తశుద్ధితో కేంద్రం దగ్గరకు వెళ్దాం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

    • కేంద్రం తలుచుకుంటే బిల్లు ఒక్కరోజులో చట్టరూపం దాలుస్తుంది: మహేష్‌గౌడ్

  • Oct 18, 2025 11:20 IST

    తిరుమల: శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసిన దళారీ

    • హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కిట్టించిన దళారీ అశోక్

    • గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా భక్తుల నుంచి రూ.4.10 లక్షలు వసూలు

    • డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ ఆఫ్ చేసి పరారైన దళారీ

    • మోసపోయామని విజిలెన్స్ వింగ్‌ను ఆశ్రయించిన బాధితుడు అమన్ గోయల్

    • ఈ మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన భక్తుడు

    • విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 18, 2025 11:12 IST

    పిల్లలను నిలదీయగా వెలుగులోకి వచ్చిన ఇర్ఫాన్ లైంగిక దాడి

    • మరో ఘటనలో బాలికపై అత్యాచారం చేసి వేధింపులకు గురి చేస్తున్న యువకుడు పై పోక్సో కేసు

    • భర్తతో విభేదించి పదిహేనేళ్లుగా కూతురితో కలిసి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ..

    • ఏడాది క్రితం ఒంటరిగా ఉన్న బాలికపై ఆత్యాచారం చేసిన విజయ్ అనే యువకుడు

    • ఆ సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు చూపించి పలు మార్లు అత్యాచారం.

    • బాలిక తల్లి పిర్యాదుతో విజయ్ పై పోక్సో కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు

  • Oct 18, 2025 11:12 IST

    ఢిల్లీ NCRలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

    • ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 300 పాయింట్లకు చేరిన వాయు నాణ్యత

    • ఆనంద్ విహార్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్‌లో పెరిగిన వాయు కాలుష్యం

  • Oct 18, 2025 10:01 IST

    ఏలూరు: అమీనాపేట దగ్గర బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో అగ్నిప్రమాదం

    • స్థానికుల సమాచారంతో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది

    • షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం

  • Oct 18, 2025 09:48 IST

    తెలంగాణలో మెుదలైన బీసీ బంద్

    • ఎక్కడికక్కడ నిలిపిపోయిన ఆర్టీసీ బస్సులు

    • రోడ్లపైకి చేరుకుని బంద్ చేస్తున్న బీసీ సంఘాల నేతలు