Octopus : పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌లు ఎందుకు చనిపోతాయి.. 6 నమ్మశక్యం కాని వాస్తవాలు..
ABN, Publish Date - Mar 09 , 2025 | 06:12 PM
Tragic Fate of Female Octopuses: ఆడ ఆక్టోపస్‌లు పిల్లల్ని కన్న తర్వాత ఎందుకు చనిపోతాయి. ఇన్నాళ్లూ మిస్టరీగానే మిగిలిపోయిన ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానాలు కనుగొన్నారు. ఈ 6 కారణాల వల్లే వాటికి..
1/6
భూమికి ఉండే ఇతర జీవులతో పోల్చితే ఆడ ఆక్టోపస్ జీవితం వింతైనది. విషాదకరమైనది. అన్ని జీవులకు అమ్మతనం మరో జన్మ అయితే, వీటికి మాత్రం అదే ఆఖరి శ్వాస. ఇలా ఎందుకు జరుగుతుందో అసలు కారణాలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు
2/6
ఆడ ఆక్టోపస్‌లు వింతైన మరియు విషాదకరమైన జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఇవి గుడ్లు పెట్టిన తర్వాత తినడం పూర్తిగా మానేస్తాయి. పిల్లల్ని పొదిగేందుకు అలాగే నిద్రాహారాలు మాని కాచుకుని కూర్చుంటాయి. పిల్లల్ని పొదిగే ముందే చనిపోతాయి.
3/6
ఆక్టోపస్‌లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని రక్షించుకోవడానికి నిరంతరం గూటికి దగ్గరగా ఉంటాయి. గుడ్లకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవడానికి పూర్తిగా తమను తాము అంకితం చేసుకుంటాయి.
4/6
గుడ్లను పెట్టిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే ప్రతి ఆడ ఆక్టోపస్ తన జీవితంలో చేసే చివరి పని కావడం విషాదకరం.
5/6
గుడ్లను సంరక్షించుకునేందుకు విపరీతమైన అంకితభావంతో కష్టపడతాయి ఆక్టోపస్‌లు. చివరికి దీనివల్లే మరణిస్తాయి. ఈ ప్రక్రియలో ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, అవి తినడానికి నిరాకరిస్తాయి. చివరికి ఆకలితో చనిపోతాయి.
6/6
కొన్ని ఆడ ఆక్టోపస్‌లు ఆకలి బాధ సహించలేక వాటికవే హాని చేసుకుంటాయి. చర్మాన్ని చింపి వాటి చేతులను అవే తింటాయి. దీనివల్ల వేగంగా మరణానికి దగ్గరవుతాయి. ఆకలికి నీరసించడం, స్వీయ హాని కారణంగానే ఇవి చనిపోతాయి.
Updated at - Mar 10 , 2025 | 12:32 AM