Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే

ABN, Publish Date - Oct 09 , 2025 | 06:34 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ ఉబలాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 1/8

అమెరికాలో ఇప్పటివరకూ నలుగురు అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతి పొందారు. థియోడోర్ రూస్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలను ఈ బహుమతి వరించింది.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 2/8

ఈసారి నోబెల్ శాంతి బహుమతి నామినీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 3/8

రష్యా-జపాన్ యుద్ధం ముగింపులో కీలకంగా వ్యవహరించిన థియోడోర్ రూస్‌వెల్ట్ 1906లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఈ ప్రైజ్ గెలుచుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 4/8

థియోడోర్ రూస్‌వెల్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ సమయంలో చరిత్ర, రాజకీయాలపై ఆయనకు ఇష్టత పెరిగింది.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 5/8

1919లో వుడ్రో విల్సన్ నోబెల్ శాంతి బహుమతి పొందారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు, లీగ్ ఆఫ్ నేషన్స్ అనే అంతర్జాతీయ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి ఈ బహుమతిని గెలుచుకున్నారు.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 6/8

అంతర్జాతీయ ఘర్షణలకు ముగింపు పడేలా చేయడంతో పాటు మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన జిమ్మీ కార్టర్‌కు 2002లో నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 7/8

అంతర్జాతీయ సహకారం పెంపొందించేలా చేయడం, దౌత్యం, అణ్వాయుధ నిర్మూలకు కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా నోబెల్ బహుమతి వరించింది.

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు వీరే 8/8

వుడ్రో విల్సన్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో, జిమ్మీ కార్టర్ యూఎస్ నేవల్ అకాడమీలో పట్టభద్రులయ్యారు. బరాక్ ఒబామా కొలంబియా యూనివర్సిటీతో పాటు హార్వర్డ్ లా స్కూల్లో కూడా చదువుకున్నారు.

Updated at - Oct 09 , 2025 | 06:53 PM