Varanasi: వారణాసి వెళితే ఈ ఫుడ్స్ కచ్చితంగా ట్రై చేయండి!
ABN, Publish Date - Jan 03 , 2025 | 03:46 PM
గంగానదీ తీరాన ఆధ్యాత్మికకాంతులీనే నగరం వారణాసి. ఇక మహాదేవుడిని దర్శించుకునేందుకు వచ్చే అనేక మంది భక్తులు స్థానికంగా లభించే వంటకాలను కూడా ఆస్వాదిస్తుంటారు. మరి, ఈసారి మీరూ వారణాసి వెళ్లేటట్టైతే ఈ వంటకాలను తినడం అస్సలు మర్చిపోవద్దు.

పాలమీగడతో చేసే మలయ్యో.. పర్షియన్ మూలాలున్న వంటకం. దీన్ని చలికాలంలో ఎక్కువగా తింటారు. కుంకుమ పువ్వు, ఏలకులు వేసే చేసే ఈ స్వీట్ ఒక్కసారి తింటే ఇక మళ్లీ వదిలిపెట్టలేము.

పెరుగు అంటే ఇష్టపడే వాళ్లు వారణాసిలో చెనా దహీ వడ. శనగలు, ఇతర మసాలాలతో చేసే ఈ వడను పెరుగులో నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది

గోధుమ పిండి ఉండల మధ్యలో, బంగాళదుంప పేస్టు, రకరకాల మసాలాలు కూరి ఉండలుగా చేసి వండే బాటీ ఛోకా కూడా వారణాసిలో లభించే మరో అద్భుతమైన ఫుడ్.

ఉడకబెట్టిన శనగలకు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇతర మసాలాలు జత చేసి చేసే లయ్యా ఛనా కూడా స్నాక్స్ రూపంలో లొట్టలేసుకుంటూ తినొచ్చు

బంగాళదుంప, టమాటా ముక్కలు ఇతర మసాలాలతో చేసే టామాటా ఛాట్ వారణాసిలో చాలా ఫేమస్. ఇది లొట్టలేసుకుంటూ తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు

మైదాపిండి, బంగాళదుంప పేస్టు, ఇతర మసాళాలతో చేసే కచోరీలు కూడా వారణాసిలో కచ్చితంగా తినాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు.

జీఐ గుర్తింపు ఉన్న వారణాసి పాన్‌ను కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. పాన్‌ను ఇష్టపడేవారు జీవితంలో ఒక్కసారైనా ఈ పాన్‌ను రుచి చూడాలని జనాలు చెబుతుంటారు.

పచ్చి బఠాణీలు, అటుకులతో చేసే పోహా కూడా వారణాసికి వెళ్లినప్పుడు కచ్చితంగా ట్రై చేయాలి. కిస్‌మిస్, కుంకుమపువ్వుతో చేసే ఈ వంటకాన్ని అత్యధికులు తమ ఫేవరెట్‌గా చెబుతారు.
Updated at - Jan 03 , 2025 | 03:53 PM