చైనాలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ ట్రెయిన్ ఆవిష్కరణ!
ABN, Publish Date - Jan 02 , 2025 | 03:02 PM
దూరప్రయాణాలకు ఇప్పుడు అనేక దేశాల్లో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యద్భుత సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణాల కారణంగా ప్రయాణికుల ఆదరణ కూడా పెరుగుతుంది. భారత్ కూడా బుల్లెట్ రైలు సర్వీసు కోసం కసరత్తు చేస్తుండగా చైనా మరో కొత్త బుల్లెట్ రైలు మోడల్‌తో ముందుకొచ్చింది.

చైనా తాజా సీఆర్450 పేరిట కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరించింది. ఇది గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

సీఆర్450 గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తే ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం 2.5 గంటల్లో చేరుకోగలవు. ఇక ముంబై-అహ్మదాబాద్ ప్రయాణాన్ని కేవలం 1.15 గంటల్లో ముగించేస్తాయి.

సీఆర్450లో 7 స్టార్ హోటళ్లను తలపించే అనేక అత్యాధునిక వసతులు ఉన్నాయి. ప్రైవేటు కంపార్ట్‌మెంటులు, రిక్లైనర్ సీట్లు వంటివన్నిటినీ అద్భుత ప్రయాణాఅనుభూతినిచ్చేలా డిజైన్ చేశారు.

తాజా మోడల్‌పై చైనా ఇప్పటికే పలు ప్రయోగాలు పూర్తి చేసింది. కమర్షియల్ కార్యకలాపాలకు వీలుగా తుది మెరుగులు దిద్దుతోంది.

ఈ బుల్లెట్ రైళ్లకు సంబంధించి సీఆర్450ఎఫ్, సీఆర్450బీఎప్ అనే రెండు ప్రయోగాత్మక మోడళ్లను చైనా సిద్ధం చేసింది.

ఈ రైళ్లల్లో అత్యాధునిక వాటర్ కూల్డ్, పర్మెనెంట్ మేగ్నెట్ ట్రాక్షన్ వ్యవస్థను ఉపయోగించారు. భద్రత కోసం హైస్పీడ్ బోగీ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు.

బహుళంచెల బ్రేకింగ్ వ్యవస్థ ఈ రైలుకు ఉన్న మరో ప్రత్యేకత. రైల్లోని క్రిటికల్ వ్యవస్థలను మొత్తం 4 వేల సెన్సర్లు నిరంతం పర్యవేక్షిస్తుంటాయి.

గాలి నిరోధకతను తగ్గించే విధంగా రైలు బోగీని డిజైన్ చేయించారు.
Updated at - Jan 02 , 2025 | 03:03 PM