తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో రెండు గిన్నిస్ రికార్డులు

ABN, Publish Date - Sep 29 , 2025 | 08:42 PM

తెలంగాణ బతుకమ్మ సంబరాలు సరూర్‌నగర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. రెండు గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాయి. 10 వేల మందితో నిర్వహించిన ఈ మహా బతుకమ్మ కార్యక్రమం అతిపెద్ద జానపద నృత్యంగా రికార్డు నెలకొల్పింది. 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ 1,354 మంది మహిళలు లయబద్ధంగా నృత్యం చేసి మరో రికార్డు సృష్టించారు. తెలంగాణ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఈ వేడుక అద్భుత విజయం సాధించింది.

Updated at - Sep 29 , 2025 | 08:48 PM