ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ABN, Publish Date - Mar 05 , 2025 | 06:30 PM
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతించేది లేదన్న నిబంధనను ఈసారి అధికారులు తొలగించారు.

ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.

చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు.

విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.

పలు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు తమ చెప్పులను బయట వదిలి లోపలికి వెళ్లారు.
Updated at - Mar 05 , 2025 | 07:05 PM