తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
ABN, Publish Date - Nov 27 , 2025 | 08:36 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తరలిస్తున్నారు.
1/5
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఈ రోజున పలువురు అభ్యర్థులు తొలి దశ నామినేషన్లు వేశారు.
2/5
సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా కంది మండలంలోని కావలంపేట గ్రామాన్ని ఎలక్షన్ అధికారులు సందర్శించారు.
3/5
మహబూబ్నగర్ రూరల్ మండలం అల్లీపూర్ కోడూరు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
4/5
సంగారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ మొదటి విడతలో భాగంగా సర్పంచ్ నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు తరలివచ్చారు.
5/5
ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అధికారులు అవకాశం కల్పించారు.
Updated at - Nov 27 , 2025 | 08:44 PM