హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన

ABN, Publish Date - Dec 26 , 2025 | 10:55 AM

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. నిన్న(గురువారం) సెలవు దినం కావడంతో తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంలోని 38వ బుక్‌ఫెయిర్‌ సందర్శకులతో నిండిపోయింది. పిల్లలు, పెద్దలు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించి.. వివిధ రకాల పుస్తకాలను కొనుగోలు చేశారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 1/7

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గురువారం భారీగా నగర వాసులు బుక్ ఫెయిర్‌ను సందర్శించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 2/7

నిన్న(గురువారం) సెలవు దినం కావడంతో తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంలోని 38వ బుక్‌ఫెయిర్‌ సందర్శకులతో నిండిపోయింది.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 3/7

పిల్లలు, పెద్దలు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించి.. వివిధ రకాల పుస్తకాలను కొనుగోలు చేశారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 4/7

కొందరు మహిళలు తమ పిల్లలతో బుక్ ఫెయిర్ కు హాజరై.. పుస్తకాల పట్ల తమకు ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 5/7

మరోవైపు బాలోత్సవంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 6/7

బుక్ ఫెయిర్‌కు వచ్చేవారికి రూ.10 ఎంట్రీ ఫీజు చెల్లించాని, కవులు, రచయితలకు, పాత్రికేయులకు ఉచిత ప్రవేశం ఉంటుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకుబ్ తెలిపారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన 7/7

ఇదే వేదికపై పుస్తక స్ఫూర్తి పేరుతో నిర్వహిస్తున్న చర్చా వేదికలు అందరినీ ఆలోచింపచేశాయి. మరోవైపు కొంపెల్లి వెంకట్‌గౌడ్‌ వేదికపై కొత్త పుస్తకాలు పురుడుపోసుకున్నాయి.

Updated at - Dec 26 , 2025 | 10:55 AM