APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం..

ABN, Publish Date - Aug 09 , 2025 | 11:57 AM

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-4 టోర్నీ శుక్రవారం నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 1/11

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-4 టోర్నీ శుక్రవారం నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 2/11

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 3/11

ప్రారంభ కార్యక్రమంలో సినీ నటుడు వెంకటేశ్‌, ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్‌, క్రికెటర్లు పాల్గొన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 4/11

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రలోని ప్రతిభ గల క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం, ప్రోత్సహించడమే ఏపీఎల్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 5/11

గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల క్రికెటర్లకు ఏపీఎల్‌ వేదికగా నిలుస్తుందన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని ఆంధ్రలోని క్రికెట్‌ టాలెంట్‌ గెలవాలన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 6/11

గత ప్రభుత్వంలోని కార్యవర్గం క్రికెటర్లతో ఆటలాడుకున్న నేపథ్యంలో ఏపీఎల్‌-4 టోర్నీలో కొత్త మార్పులు తీసుకువచ్చి ప్రతిభకు అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 7/11

దేశంలో క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవ లేదని, తగిన ప్రోత్సాహం అందిస్తే ఊహించని ఫలితాలు సాధిస్తారన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 8/11

అనంతరం మరో ముఖ్య అతిథి, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌తో కలిసి తొలి మ్యాచ్‌లో తలపడుతున్న అమరావతి రాయల్స్‌, కాకినాడ కింగ్స్‌ జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకుని అభినందించారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 9/11

ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్‌, విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం.శ్రీభరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 10/11

ప్రారంభోత్సవంలో సినీ నటి ప్రగ్యా జైస్వాల్‌ డ్యాన్స్‌ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.

APL-4: అట్టహాసంగా టోర్నీ ఏపీఎల్‌-4 ప్రారంభం.. 11/11

విశాఖలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 క్రికెట్‌ మ్యాచ్‌‌ను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థినిలు.

Updated at - Aug 09 , 2025 | 11:57 AM