Winter-Ooty Trip: ఊటీ.. మోస్ట్ బ్యూటీ.. ప్రకృతి సోయగాలను చూసేయండి..
ABN, Publish Date - Dec 26 , 2025 | 05:55 PM
వేసవికాలం వచ్చిందంటే చాలు.. అధిక ఉష్ణోగత్రల నుంచి ఉపశమనం కోసం చాలా మంది జమ్మూ కశ్మీర్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇక సౌత్ ఇండియన్స్ అయితే దక్షిణ కశ్మీర్‌గా పేరొందిన ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. కశ్మీర్ అందాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఊటీని చూసేందుకు..
1/10
హిమాలయాలు నిత్యం మంచుతో కప్పబడి ఉండి.. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హిమాలయాల ప్రకృతి సోయగాలను చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్‌కి వెళ్తుంటారు. అయితే, దక్షిణ భారత్‌లోనూ కశ్మీర్‌ను తలపించే ప్రాంతం ఉంది. అదే ఊటీ.
2/10
హిమాలయాలు నిత్యం మంచుతో కప్పబడి ఉండి.. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హిమాలయాల ప్రకృతి సోయగాలను చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్‌కి వెళ్తుంటారు. అయితే, దక్షిణ భారత్‌లోనూ కశ్మీర్‌ను తలపించే ప్రాంతం ఉంది. అదే ఊటీ.
3/10
వేసవి కాలంలో కంటే కూడా చలికాలంలో ఊటీ అందాలు మరింత ఆకర్షణీయంగా, రమణీయంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పేసి.. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా అక్కడి ప్రకృతి ఉంటుంది.
4/10
ఈ శీతాకాలంలో తమిళనాడులోని ఊటికి పర్యాటకుల తాకిడీ భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంలో అక్కడ మంచు వర్షం కురుస్తోంది.
5/10
మంచు వర్షం కారణంగా ఊటీ పరిసర ప్రాంతాలన్నీ మంచు దుప్పటి కప్పేసినట్లుగా కనిపిస్తోంది. పచ్చని చెట్లపై.. తెల్లని మంచు వర్షం కురుస్తుండటంతో.. ఆ ప్రాంతం ఎంతో రమణీయంగా కనువిందు చేస్తోంది.
6/10
అక్కడికి వెళ్లిన పర్యాటకులు అచ్చం కశ్మీర్ లోయను వీక్షించినట్లుగా ఫీల్ అవుతున్నారంటే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
7/10
ఊటీలోని లోయ ప్రాంతం అంతా మంచు దుప్పటి పరిచినట్లుగా కనిపిస్తోంది. ఆ మంచు వర్షంలోనే పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
8/10
ప్రస్తుతం ఊటీకి పర్యాటకు తాకిడీ చాలా ఎక్కువగా ఉండటంతో ఈ రూట్ అంతా భారీగా ట్రాఫిక్ ఉంది. వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి.
9/10
ఊటీలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో.. పర్యాటకులు పరువులు చలిమంటలు వేసుకుని ఆస్వాదిస్తున్నారు.
10/10
ఊటీ లోయ ప్రాంతాల్లో మంచు తెరలను పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పోటెత్తడంలో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది.
Updated at - Dec 26 , 2025 | 05:56 PM