Beeranna Bonalu: తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో కరీమాబాద్ ‘బీరన్న’ బోనాలు
ABN, Publish Date - Jul 06 , 2025 | 10:10 PM
తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో కరీమాబాద్ ‘బీరన్న’ బోనాలు
1/13
తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో కరీమాబాద్ ‘బీరన్న’ బోనాలు
2/13
వరంగల్ కరీమాబాద్‌లో బీరన్న బోనాల ఉత్సవానికి హాజరైన మంత్రి సురేఖ
3/13
విష్ణువుకు ప్రీతికరమైన రోజు ఉపవాసాల వ్రతాలు ప్రారంభమయ్యే శుభదినం.. పండుగలకు స్వాగతం పలికే రోజు ‘తొలి ఏకాదశి’.
4/13
ఆషాడ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.
5/13
తొలి ఏకాదశి సందర్బంగా వరంగల్ కరీమాబాద్ లో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతమూర్తులకు బోనాలు సమర్పించారు.
6/13
రామస్వామి గుడి నుంచి బురుజు సెంటర్ మీదుగా ఒగ్గుడోలు కళాకారుల వాయిద్యాలు..శివాసత్తుల నృత్యాలు..బీరన్నల విన్యాసాలు మధ్య వందలాది మంది మహిళలు బోనాలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకున్నారు.
7/13
ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చి ఒడిబియ్యం పోశారు.
8/13
శతాబ్ద క్రితం ప్లేగు వ్యాధి పుట్టి ప్రజలు చనిపోతుండగా వారు బీరన్న స్వామిని ప్రార్థించి, ఈ వ్యాధిని నివారిస్తే నీకు బోనం సమర్పిస్తాము అన్నారు. ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి తగ్గిపోయిందన్న విశ్వాసంతో బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటినుండి ఏటేటా వైభవంగా ఈ బోనాల ఆచారం కొనసాగుతోంది.
9/13
1957 సంవత్సరం నుండి సైదాపూర్ మండల కరీంనగర్ జిల్లా కి చెందిన బీరన్నలు వస్తున్నారు. బీరన్నలు పసుపు, కుంకుమ రాసుకుని, చిప్పలు మోగిస్తూ తాళాలు వేసుకుంటూ, కత్తుల తో విన్యాసాలు చేస్తూ ఊరేగింపులో ముందుంటారు.
10/13
బోనం అనేది ఒక మట్టి గిన్నె(పాత్ర) అందులో అన్నం, పెరుగు, బెల్లం పెట్టి పూలతో అలంకరించి, తల మీద మోసి బీరన్నకి సమర్పిస్తారు.
11/13
బోనాల్లో ముఖ్యమైన ఘట్టం గావు. ప్రత్యేక వేషధారణలో ఉన్న బీరన్నలు గావు పడుతారు. గొర్రె పిల్ల తలను కోరికి రక్తం చిందిస్తుండగా..భక్తులు గొర్రె పొట్టేలు రక్తాన్ని వీర తీలకంగా పెట్టుకోవడానికి యువకులు ఉత్సాహం కనుబరుస్తారు.
12/13
బోనాలతో ఉన్న మహిళలందరూ గావు పట్టిన గొర్రె పిల్లను దాటుతూ ఆలయానికి చేరుకుంటారు. మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని బీరన్నకు మహిళలు కొత్త బట్టలు పెట్టి కొత్త కుండలో తెచ్చిన బోనాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
13/13
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తొలి ఏకాదశి ముందు రోజున బీరన్నలు కురుమ కులస్తుల ఇంటిపై బలి బలి అంటూ సరుగు చల్లుతారు.
Updated at - Jul 06 , 2025 | 10:13 PM