Union Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఆ అధికారులతో కీలక సమీక్ష..
ABN, Publish Date - Jan 30 , 2025 | 02:17 PM
కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు.

విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

గజమాలతో ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, స్థానిక విద్యార్థులు

స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్రమంత్రులు

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం

మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత1449 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల దీక్షలు
Updated at - Jan 30 , 2025 | 02:29 PM