Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి

ABN, Publish Date - Nov 05 , 2025 | 09:05 AM

లండన్‌లో నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. మే ఫెయిర్ హాలులో అవార్డుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 1/6

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకున్నారు.

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 2/6

లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ అవార్డును అందజేశారు.

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 3/6

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 4/6

కార్పొరేట్ గవర్నెన్స్‌ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డును సంస్థ వీసీఎండీ హోదాలో నారా భువనేశ్వరి స్వీకరించారు.

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 5/6

ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాల గురించి నారా భువనేశ్వరి వివరించారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Nara Bhuvaneswari: రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి 6/6

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్ధ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

Updated at - Nov 05 , 2025 | 10:37 AM