Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్

ABN, Publish Date - Nov 08 , 2025 | 03:41 PM

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం నాడు పరిశీలించారు. వాటర్ ఫాల్స్‌తో పాటు లోపల ఉన్న టూరిజం స్పాట్స్‌, వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 1/10

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 2/10

మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ మొక్కలు నాటారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 3/10

అడవిలో నాలుగు కిలోమీటర్లకుపైగా ప్రయాణం చేశారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునూ పవన్ పరిశీలించారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 4/10

ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 5/10

మామండూరులో అటవీ శాఖ ఏర్పాటు చేసిన 360° వాచ్ టవర్ ఎక్కి శేషాచలం అడవిని డిప్యూటీ సీఎం పరిశీలించారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 6/10

నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 7/10

వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 8/10

గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 9/10

ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

Deputy CM Pawan: మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ 10/10

టీషర్ట్‌తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.

Updated at - Nov 08 , 2025 | 03:45 PM