వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌

ABN, Publish Date - Dec 24 , 2025 | 12:31 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని అప్పట్లో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 1/7

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 2/7

వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 3/7

ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని అప్పట్లో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 4/7

ఆమెకు ఇచ్చిన మాట మేరకు తాజాగా పవన్ ఇప్పటంలో పర్యటించారు.. నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 5/7

పవన్ కల్యాణ్ కు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 6/7

వృద్ధురాలికి రూ.50వేలు, ఆమె మనవడి చదువుకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు.

వృద్ధురాలికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ 7/7

ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెలా తన వేతనం నుంచి రూ.5వేలు ఇవ్వాలని పవన్‌ నిర్ణయించారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని నాగేశ్వరమ్మ తెలిపారు

Updated at - Dec 24 , 2025 | 12:31 PM