Vivek Ramaswamy Barefoot Controversy: ఇంట్లో షూస్ వేసుకోని వివేక్ రామస్వామిపై భారీ స్థాయిలో ట్రోలింగ్!
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:58 PM
భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ఇంట్లో బూట్లు వేసుకోకుండా కనిపించం కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఒహాయో రాష్ట్ర గవర్నర్ రేసులో పోటీ పడుతున్న భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా కొత్త కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయనకు మద్దతుగా నిలివగా మరికొందరు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
తన ఇంట్లో ఓ మీడియా సంస్థకు గతంలో ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా కాళ్లకు బూట్లు లేకుండా కనబడటం పెద్ద వివాదానికి దారి తీసింది. ఇంట్లోనే ఉండటంతో వివేక్ షూస్ వేసుకోకుండానే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే కాంట్రవర్సీకి కారణమయ్యింది.
భారతీయ నర్సులను స్వదేశానికి చేర్చడంలో తెలుగు ఎన్నారైల చొరవ
అనేక మంది అమెరికన్లు వివేక్ తీరును తప్పుబట్టారు. ఇంట్లో బూట్లు వేసుకోకుండా ఉండటం అమర్యాదకరం, సంస్కార రహితం అని కొందరు మండిపడ్డారు. ఇది అమెరికన్ల జీవన విధానం కాదని, ఇలాంటి వారు గవర్నర్ కాలేరని స్పష్టం చేశారు.
మరికొందరు మాత్రం వివేక్‌కు మద్దతుగా నిలిచారు. దక్షిణాసియా దేశాలు, ఆసియా సంస్కృతుల ప్రకారం ఇంట్లో బూట్లు చెప్పులు వేసుకుని తిరగడం అమర్యాదకరమని కొందరు చెప్పుకొచ్చారు. ఇంట్లో బూట్లు వేసుకుని తిరగడం అపరిశుభ్రమైన తీరని కూడా కొందరు చెప్పారు.
మరికొందరు అమెరికన్లే ఇంట్లో బూట్లు వేసుకోవడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇంట్లో ప్లోరింగ్ టేకుతో ఉన్నప్పుడు బూట్లు వేసుకుంటే జారి పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతుల వారు తమ విధానాలను మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
Singapore: శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంపై ప్రసంగాలు
పాశ్చాత్య దేశాల్లోని వారు ఇళ్లల్లో కూడా షూస్ వేసుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ అలవాటు యథాతథంగా కొనసాగుతోంది. అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో షూస్ లేదా చెప్పులు లేకుండా కనిపించడం వారు అమర్యాదకరంగా భావిస్తారు. అంతేకాకుండా, చలి నుంచి రక్షణ కోసం షూస్ ధరిస్తారు.
అయితే ఆసియా దేశాల్లో మాత్రం ఇంట్లో షూస్ వేసుకోవడం దాదాపు నిషిద్ధమనే చెప్పాలి. చెప్పులు, బూట్ల కారణంగా దుమ్మూధూళీ వ్యాపిస్తుందని భావిస్తారు. శుభప్రదమైన ఇంట్లో చెప్పులు వేసుకోవడం అమర్యాదకరమని, సంప్రదాయానికి విరుద్ధమని నమ్మకం కూడా ఈ అలవాటుకు కారణం. ఇక ఇంట్లో ఉత్త కాళ్లతో నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది.