Share News

US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు

ABN , Publish Date - May 20 , 2025 | 08:20 AM

అమెరికాలో అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్న భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు

వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి అక్రమ వలసలకు కారణమైన ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలోకి అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని గుర్తించేందుకు భారత్‌లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు నిత్యం ప్రయత్నిస్తుంటాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో అమెరికాలోకి అక్రమ వలసలను ప్రోత్సహించిన ట్రావెల్ ఏజెంట్ సంస్థల ఓనర్లు, సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బందిపై ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఈ చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.


అక్రమ వలసలతో వచ్చే ప్రమాదాలపై విదేశీయులకు అవగాహన కల్పించడంతో పాటు వీటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలో చట్టబద్ధ పాలన, పౌరుల పరిరక్షణకు ఇది అవసరమని తేల్చి చెప్పింది. ఈ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయని, వీసా వైవర్ ప్రోగ్రామ్ పరిధిలోని వారికి కూడా మినహాయింపు లేదని స్పష్టం చేసింది. అయితే, ఏయే ట్రావెల్ ఏజెంట్స్‌పై ఆంక్షలు విధించారనే విషయాలను వెల్లడించేందుకు భారతీయ ఎంబసీ అధికారి ఒకరు నిరాకరించారు.


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు.. జనాల గగ్గోలు

ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా

SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

Read Latest and NRI News

Updated Date - May 20 , 2025 | 08:25 AM