Sliconandhra: మహిళల సారథ్యంలో సిలికానాంధ్ర నూతన కార్యవర్గం
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:09 AM
సిలికానాంధ్ర నూతన కార్యవర్గం తాజాగా ఏర్పాటయ్యింది. తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటంపై ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సిలికానాంధ్ర 2025–2027 కమిటీని ప్రకటించారు. ఈమారు తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటంపై ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షురాలిగా సత్యప్రియా తనుగుల, ఉపాధ్యక్షురాలిగా శిరీష కలేరు, కోశాధికారిగా మాధవి కడియాల, కార్యదర్శిగా రామ సరిపల్లె, సంయుక్త కార్యదర్శిగా ఉష మాడభూషిలు బాధ్యతలు స్వీకరించారు.
వీరందరూ అనేక సంవత్సరాలుగా సంస్థకు సేవలందిస్తూ సాంస్కృతిక మహోత్సవాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వారి కృషి, దృష్టి, నాయకత్వం సమాజంపై సిలికానాంధ్ర ప్రభావాన్ని వ్యాప్తిచేయగా, ఇప్పుడు సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కుచిభొట్ల ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గానికి కూచిభొట్ల శాంతి, రాజు చమర్తి, దిలీప్ కొండిపర్తి తదితరులు అభినందనలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:
నడి వీధిలో కత్తితో విన్యాసం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో సిక్కు వ్యక్తి మృతి
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం