NRI News: హాంకాంగ్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు..
ABN , Publish Date - Feb 10 , 2025 | 01:49 PM
హాంకాంగ్‌లోని హిందూ దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక పూజ వైభవంగా జరిగింది. ఈ వార్షిక ఉత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి, ఆమె బృందం ఘనంగా నిర్వహించారు. వారు ఈ కార్యక్రమాన్ని ఒక దశాబ్దం కాలం నుంచి నిర్వహిస్తున్నారు.

హాంకాంగ్‌లోని హిందూ దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక పూజ వైభవంగా జరిగింది. ఈ వార్షిక ఉత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి, ఆమె బృందం ఘనంగా నిర్వహించారు. వారు ఈ కార్యక్రమాన్ని ఒక దశాబ్దం కాలం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ తాజా కార్యక్రమంలో కొత్తగా వివాహం చేసుకున్న జంటల నుంచి వృద్ధ దంపతుల వరకు, అనేక మంది ఈ పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలు, ఆనందంతో ఈ పూజ చేసుకున్నారు. దీంతో ఈ సామూహిక పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
ఈ విజయానికి కారణం కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద సేవకుల మద్దతు, సహాయ సహకారాలు అని అధ్యక్షురాలు జయ కొనియాడారు. ఇటువంటి సామూహిక పూజలు, సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని, యువతరంలో ఆధ్యాత్మికాభివృద్ధికి, చైతన్యాభివృద్ధికి ఒక ప్రతీకగా నిలుస్తాయని పూజకు హాజరైన కాన్సుల్ కె. వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమం ఆనందంగా జరగడానికి అందరూ సహకరించారని ప్రశంసించారు. పూజలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు, హిందూ అసోసియేషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..