Library: లైబ్రరీని విరాళంగా ఇచ్చిన ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని
ABN , Publish Date - Jan 07 , 2025 | 09:22 PM
ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని తన్వీ కొడాలి శేరీలింగంపల్లి ఇజ్జత్ నగర్‌లోని ఎంపీ ప్రైమరీ స్కూ్‌ల్‌కు జనవరి 7న లైబ్రరీని విరాళంగా ఇచ్చారు.

ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని తన్వీ కొడాలి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆర్ఏఐఎస్ఈ కార్యక్రమంలో భాగంగా శేరీలింగంపల్లి ఇజ్జత్ నగర్‌లోని ఎంపీ ప్రైమరీ స్కూ్‌ల్‌కు జనవరి 7న లైబ్రరీని విరాళంగా ఇచ్చారు. తన్వి విరాళమిచ్చిన ఈ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ప్రముఖులు పి. వెంకటేశ్వర్లు. ఎస్. రాజమౌళి, వి. స్వప్న కుమార్, వి.శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన్వి అక్కడి విద్యార్థులకు ప్రింటర్ ఇవ్వడంతో పాటు వారికి అనేక ఇంట్రా, ఎక్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిచయం చేశారు. ప్రతిభ ఉన్నా అవకాశాలు లేక ఎందరో విద్యార్థులు వెనకబడుతున్న వైనాన్ని గుర్తించిన తన్వి తన వంతుగా సమాజసేవకు నడుం కట్టారు. ఇక విద్యార్థుల ప్రతిభకు మరింత మెరుగుపెట్టే దిశగా ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్..ఆర్ఏఐఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
NRI: సౌదీలో సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి
చిన్నతనం నుంచే తన్వీ, తన కుటుంబంతో కలిసి వివిధ సందర్భాల్లో ఆ స్కూల్ విద్యార్థులకు అల్పాహారం వంటివి పంపిణీ చేసేవారు. అలా ఆమెకు స్కూల్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. సమాజంలో అందరికీ సమానావకాశాలు లేవన్న కఠోర వాస్తవం ఎదుగుతున్న కొద్దీ తన్వికి అర్థమైంది. ఈ భావనే ఆమెను అవసరంలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అవకాశాలు సృష్టించాలన్న తపనతో ఆమె లైబ్రరీల ఏర్పాటుపై దృష్టిసారించారు. ఐక్యరాజ్య సమితి నాల్గవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం దిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో చేతనైన సాయం చేస్తున్నారు. తన్వీ స్ఫూర్తిగా ఆమె తోటి వారు అనేక మంది స్కూళ్లకు పుస్తకాలు నిధులు సమకూర్చారు. ఇక తమ స్కూల్లో లైబ్రరీ ప్రారంభమైనందుకు టీచర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..
అవసరంలో ఉన్న విద్యార్థులకు తన శక్తి మేరకు సాయపడాలని నిశ్చయించుకున్న తాన్వీ తన కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా పంచుకునేందుకు ఆర్ఏఐఏస్ఈ ఇనీషియేటివ్ ఇన్‌స్టా పేజీని ఏర్పాటు చేశారు. తను చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలను అందులో పంచుకుంటున్నారు. వెనకబడ్డ వర్గాలకు మరింతగా చేయాలన్న తపన, ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు.