NATS: నాట్స్ తెలుగు సంబరాలు ..టాంపాలో వెంకటేష్ సందడి
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:55 PM
నాట్స్ తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నాట్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఎన్నారై డెస్క్: నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు టాంపాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేష్ టాంపాకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెంకీతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా టాంపాలో సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో నాట్స్ సంబరాలు ప్రారంభమవుతాయి. సినీనటుడు బాలకృష్ణ గురువారం నాడు మియామీ చేరుకుంటారని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు. వివరాలకు, టికెట్లకు www.sambaralu.org చూడవచ్చు.
ఇవీ చదవండి:
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ